ePaper
More
    HomeతెలంగాణMLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి తాజాగా మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కోసం ఎవరూ కాళ్లు పట్టుకోవాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అన్నారు. రాజకీయాలు అడ్డం పెట్టుకొని వచ్చి వేలకోట్ల రూపాయలు దోచుకునే వారికి పదవులు కావాలని వ్యాఖ్యానించారు. గతంలో చేసినట్లే అవసరమైతే ప్రజల కోసం మళ్లీ త్యాగం చేస్తానని పరోక్షంగా పార్టీ మార్పు అంశం గురించి వ్యాఖ్యానించారు.

    నారాయణపూర్ మండలం (Narayanpur Mandal) లచ్చమ్మ గూడెం గ్రామంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి 33/11 సబ్ స్టేషన్ని ప్రారంభించిన అనంతరం రాజగోపాల్​ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించుకునే వాడిని కాదన్నారు. మంత్రి పదవి వస్తే మంచి జరుగుతుందని మునుగోడు ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రజలకు మేలు చేసేందుకే పదవి ఆశిస్తున్నట్లు తెలిపారు.

    MLA Komati Reddy | ప్రజల కోసమే తపన..

    నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం (Munugodu Constituency) చాలా వెనుకబడి ఉందని, ఈ నియోజకవర్గాన్ని అని రంగాలలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాపైన, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Nellikanthi Satyam)పైన ఉందన్నారు. ఇద్దరి పార్టీలు వేరైనా మా ప్రధాన అజెండా అభివృద్ధి మాత్రమేనని చెప్పారు. తాను మాట్లాడితే మంత్రి పదవి రాలేదు కాబట్టే మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారని, అది తప్పు అని తెలిపారు. తనకు మంత్రి పదవి కావాలనుకుంటే నేను ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేవాడినని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే నేను ఇక్కడినుండి పోటీ చేశానని వివరించారు.

    MLA Komati Reddy | పదవుల కోసం పాకలాడను..

    తాను అందరిలా కాదని, పదవుల వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదని రాజగోపాల్​ రెడ్డి స్పష్టం చేశారు. అదృష్టం ఉండి నాకు పదవి వస్తే అది మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. రాజకీయాలు (Politics) అడ్డం పెట్టుకొని వచ్చి వేలకోట్ల రూపాయలు దోచుకునే వారికి పదవులు కావాలని వ్యాఖ్యానించారు. కానీ, రాజ్ గోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. ప్రజల సంక్షేమం కావాలి. ప్రజల అభివృద్ధి కావాలని అన్నారు.

    MLA Komati Reddy | జూనియర్లకు పదవులిచ్చారు..

    ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం (Congress Leadership) మాట ఇచ్చిందని, ఇస్తారా ఇవ్వరా అనేది హైకమండ్ ఇష్టమని అన్నారు. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చిన తనకంటే జూనియర్లకు పదవులు ఇచ్చారని రాజగోపాల్​ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నానని తనను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ‘ఎంపీని గెలిపించమంటే గెలిపించాను.. మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. అంతేకానీ ఇస్తారా. ఇవ్వరా అనేది మీ ఇష్టం, నేను మాత్రం పదవుల కోసం ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకొని బ్రతిమాలాడే రకం కాదని’ కుండబద్దలు కొట్టారు. తనకు కావాల్సింది ప్రజలు, వాళ్ల బాగోగులని తెలిపారు. ప్రజల మధ్యనే ఉంటా, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా, అవసరమైతే వాళ్ల కోసం పోరాటం చేస్తా, గతంలో చేసినట్లు మళ్లీ త్యాగం చేస్తానని చెప్పారు. త్యాగమైనా, పోరాటమైనా ప్రజల మంచి కోసమే చేస్తా.. ప్రజలు తలదించుకునే పని చేయనని తెలిపారు.

    MLA Komati Reddy | అర్హులకు ఇళ్లు రాలేదు..

    మునుగోడు ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయి. వాళ్ల కష్టాలు పోయే రోజులు వస్తున్నాయని కోమటిరెడ్డి (MLA Komati Reddy) అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వ నిబంధనల వల్ల నిజమైన లబ్ధిదారులకు కొందరికి ఇల్లులు రాలేదన్నారు. ఇల్లు రాని వారు బాధపడొద్దని, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తనదని చెప్పారు.

    గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government)లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. పదేళ్లలో కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తుందన్నారు. టీఆర్ఎస్ పాలనలో రేషన్ బియ్యం ఎవరు తినలేని పరిస్థితి.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్నబియ్యంతో పేదవాళ్ల కడుపు నింపుతున్నామని చెప్పారు.

    10 సంవత్సరాలలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే.. ఒకవైపు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ, మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses), రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్న బియ్యం, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా(Rythu BHarosa) అమలు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) అంటే పేదల పార్టీ, ఇది పేదల రాజ్యం, ఈ ప్రజా పాలనలో పేదోలందరికీ న్యాయం చేస్తామని చెప్పారు.

    Latest articles

    AYUSH Department | ఔషధ మొక్కలను సంరక్షించుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: AYUSH Department | ఆరోగ్య పరిరక్షణలో ఔషధ మొక్కల (Medicinal plants) పాత్ర కీలకమని, వాటిని...

    KTR | ఈవీఎంలు తొలగించి బ్యాలెట్​ పేపర్లు తీసుకురావాలి.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్​ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు...

    Mohammed Siraj | సిరాజ్‌పై తెలంగాణ పోలీసుల ప్ర‌శంస‌ల వ‌ర్షం.. కొత్త డిమాండ్‌కు తెర‌లేపిన ఫ్యాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohammed Siraj | టీమిండియా (Team India) స్టార్ పేసర్ బౌలర్​ మహ్మద్ సిరాజ్...

    Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Forest Department | మోపాల్ (Mopal)​ మండలలోని బైరాపూర్​లో (Birapur) ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖాధికారులు...

    More like this

    AYUSH Department | ఔషధ మొక్కలను సంరక్షించుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: AYUSH Department | ఆరోగ్య పరిరక్షణలో ఔషధ మొక్కల (Medicinal plants) పాత్ర కీలకమని, వాటిని...

    KTR | ఈవీఎంలు తొలగించి బ్యాలెట్​ పేపర్లు తీసుకురావాలి.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్​ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు...

    Mohammed Siraj | సిరాజ్‌పై తెలంగాణ పోలీసుల ప్ర‌శంస‌ల వ‌ర్షం.. కొత్త డిమాండ్‌కు తెర‌లేపిన ఫ్యాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohammed Siraj | టీమిండియా (Team India) స్టార్ పేసర్ బౌలర్​ మహ్మద్ సిరాజ్...