అక్షరటుడే, వెబ్‌డెస్క్:MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన ఆమె శుక్రవారం మంచిర్యాలలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.
తన లేఖను లీక్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలి అని ఆమె డిమాండ్ చేశారు. కాగా ఇటీవల తన తండ్రి కేసీఆర్(KCR)కు ఆమె రాసిన లేఖ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ను బీజేపీ(BJP)లో కలపాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీని నడపడం చేతకాని వారు తనకు నీతులు చెప్పొద్దని పరోక్షంగా కేటీఆర్(KTR)ను ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని ఆమె పరోక్షంగా తెలిపారు.
MLC Kavitha | పార్టీని కాపాడుకోవడమే అజెండా
తనకుంటు ప్రత్యేకంగా జెండా.. అజెండా ఏమి లేవని కవిత(MLC Kavitha) అన్నారు. పార్టీని కాపాడుకోవడమే తన అజెండా అని ఆమె పేర్కొన్నారు. బీజేపీ వైపు బీఆర్ఎస్ చూడొద్దని ఆమె సూచించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదని కవిత పేర్కొన్నారు. బీజేపీలో (BRS)ను విలీనం చేస్తామంటే ఒప్పుకోనని ఆమె స్పష్టం చేశారు.
MLC Kavitha | ఆవేదనతో లేఖ రాశా
పార్టీలో ఎన్నో ఆవేదనలు భరించాక తన తండ్రికి లేఖ రాశానని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అన్నారు. లెటర్ రాయడంలో తన తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. లెటర్‌ను బయటకు తెచ్చినవారిని పట్టుకోండని ఆమె అన్నారు. కేసీఆర్‌ను కలిసే అవకాశం వచ్చినా కలవలేకపోయానని తెలిపారు.