అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Janu Lyri | ఫోక్ డ్యాన్సర్ folk dancer జాను లిరి janu lyri ఇటీవల సోషల్ మీడియా social media లో తాను సూసైడ్ చేసుకుంటానని వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని ఆమె విలపిస్తూ వీడియో రీలీజ్ చేసింది. అయితే తాజాగా తాను రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటానని ఆమె మరో వీడియో తన ఇన్‌స్టా అకౌంట్లో పెట్టింది. తాజాగా ఈ వివాదంపై సింగర్ singer దిలీప్ దేవ్గన్ dileeep devgan స్పందించారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోతోనే జానును, తనను విపరీతంగా ట్రోల్ చేశారన్నారు.
Janu Lyri | ఔను మేము ఇష్టపడ్డాం..
సింగర్ దిలీప్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియో పోస్టు చేశాడు. అందులో తాను, జాను లిరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. తమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారని ఆయన చెప్పారు. ట్రోల్స్‌ను తట్టుకుంటామని స్పష్టం చేశారు. తామిద్దరం ఇష్టపడ్డామని, తప్పు చేయలేదన్నారు. తమకు అండగా ఉన్నవారికి దిలీప్ ధన్యవాదాలు తెలిపారు.
View this post on Instagram