HomeUncategorizedAhmadabad Plane clash | ‘రూ.కోటి ఎవరికి కావాలి.. రూ.రెండు కోట్లు ఇస్తా.. మా నాన్నను...

Ahmadabad Plane clash | ‘రూ.కోటి ఎవరికి కావాలి.. రూ.రెండు కోట్లు ఇస్తా.. మా నాన్నను తిరిగి ఇవ్వండి..’

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ahmadabad Plane clash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదంలో ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయారు. లండన్​(London) వెళ్తున్న విమానం టేకాఫ్​ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోవడంతో విమానంలోని వారితో పాటు మెడికల్​ కాలేజీ విద్యార్థులు(Medical college students) సహా మొత్తం 265 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తమ వారి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు అహ్మదాబాద్​లోని సివిల్​ ఆస్పత్రికి(Ahmedabad Civil Hospital) వచ్చారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో రోదనలు మిన్నంటాయి. ఎవరిని కదలించినా తమ వారిని కోల్పోయామని ఏడుస్తూ చెబుతున్నారు. ఈ సందర్భంగా తండ్రిని కోల్పోయిన ఓ మహిళ తన తండ్రి ఏం తప్పు చేశాడని వాపోయింది. విమానంలో కూర్చోవడమే ఆయన చేసినా తప్పా అని ప్రశ్నించింది.

ఫాల్గూని అనే మహిళా మాట్లాడుతూ.. ‘‘మృతులకు కుటుంబాలకు ఎయిర్ ఇండియా(Air India) రూ. కోటి ఎక్స్​గ్రేషియా ఇస్తామని ప్రకటించింది. ఎవరికి కావాలి రూ.కోటి ? నేను రూ.2 కోట్లు ఇస్తా.. పోయిన మా తండ్రి ప్రాణాన్ని తిరిగి ఇచ్చేయండి.. మీ వల్లే మా నాన్న దూరం అయ్యాడు.” అని వాపోయింది. విమానాన్ని ముందే చెక్​ చేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదని ఆమె అన్నారు. అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాగా డీఎన్​ఏ నమూనాలు(DNA Samples) ఇచ్చిన ఆమె తన తండ్రి మృతదేహం కోసం ఆస్పత్రిలో నిరీక్షిస్తోంది.

Must Read
Related News