అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajagopal Reddy | మంత్రి పదవిపై మరోసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పాటు అయిన నాటి నుంచి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ సమయంలో తనకు అవకాశం లభిస్తుందని ఆయన ఆశించారు. అయితే అధిష్టానం ఆ సమయంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కుమార్లను మంత్రులగా చేసింది. అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-Election) సమయంలో అజారుద్దీన్ (Azharuddin)కు మంత్రి పదవి ఇచ్చింది. తనకు పదవి రాకపోవడంతో రాజగోపాల్‌రెడ్డి గతంలో సీఎం లక్ష్యంగా విమర్శలు చేశారు. బీజేపీ నుంచి చేరిన సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చారని, ఇప్పుడు పదవి ఇవ్వడం లేదని పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. ఆర్ఆర్ఆర్కు వ్యతిరేకంగా సైతం మాట్లాడారు.
Rajagopal Reddy | సంకేతాలు వచ్చాయా..
గతంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పై తీవ్ర విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి కొన్ని రోజులుగా సైలంట్‌గా ఉంటున్నారు. తాజాగా అదృష్టం ఉంటే మంచి పదవి వస్తుందని ఆయన అన్నారు. ఇన్ని రోజులు ఆగినందుకు త్వరలోనే తనకు మంత్రి పదవి వస్తుందన్నారు. దీంతో అధిష్టానం నుంచి ఆయనకు సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు ఆపడంతో పాటు, తాజాగా పదవి వస్తుందని చెప్పడంతో కోమటిరెడ్డికి పదవిపై ఏమైనా సంకేతాలు అందినట్లు చర్చ జరుగుతోంది.
Rajagopal Reddy | పునర్వవస్థీకరణ ఉంటుందా..
రాష్ట్రం మంత్రివర్గ పునర్వవస్థీకరణ చాలా రోజులుగా ఊహగానాలు వస్తున్నాయి. పలువురు మంత్రులను తొలగించి, కొత్త వారికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ క్రమంలో ఆయా మంత్రుల పనితీరు ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం తనకు పదవి వస్తుందని చెప్పడంతో.. పునర్ వ్యవస్థీకరణ పక్కాగా జరగున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.