అక్షరటుడే, వర్ని: Mosra Village | మోస్రా గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గుత్పె భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మోస్రా జిల్లా పరిషత్ పాఠశాలను (Mosra Zilla Parishad school) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలపై హెచ్ఎం, ఉపాధ్యాయలతో (headmaster and teachers) మాట్లాడారు.
Mosra Village | నాణ్యమైన విద్యనందించాలి..
అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని సర్పంచ్ పేర్కొన్నారు. విద్యాభజన, మధ్యాహ్న భోజన నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు సంబంధించి ఎలాంటి అవసరమున్నా తాను ముందుంటానని ఆయన వెల్లడించారు. అలాగే గ్రామాభివృద్ధి కోసం ప్రణాళికతో ముందుకు వెళ్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సాయి సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.