అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో (phone tapping case) మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఆయన తెలంగాణ భవన్లో (Telangana Bhavan) మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డికి దమ్ముంటే తనను విచారణ చేసినప్పుడు తీసిన వీడియో బయట పెట్టాలన్నారు. అంతే కానీ చిల్లర లీకులు ఇవ్వొద్దన్నారు. ఇది లీకుల ప్రభుత్వం, స్కాముల ప్రభుత్వం అని విమర్శించారు. ఎక్కడికి పిలిచినా.. ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పారు. చట్టం మీద గౌరవం ఉంది.. తాను భయపడను అని స్పష్టం చేశారు.
Harish Rao | అటెన్షన్ డైవర్షన్
ఇదంతా ట్రాష్ అని హరీశ్‌రావు (Harish Rao) అన్నార. అన్నీ నిరాధారమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ముగ్గురు అధికారులు కలిపి ప్రశ్నించారని చెప్పార. అంతా అటెన్షన్ డైవర్షనే అన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరుతో జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశామన్నారు. చీటికి మాటికి సిట్లు వేస్తున్నారు కదా.. దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. దోపిడీని ప్రశ్నిస్తున్నామని.. కేసులు పెడుతున్నారని మండి పడ్డారు.
Harish Rao | నేనే ప్రశ్నలు అడిగా..
సిట్ అధికారులను (SIT officials) తాను వందల ప్రశ్నలు అడిగినట్లు హరీశ్‌రావు తెలిపారు. అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లను విచారణకు పిలవాలని అడిగానన్నారు. శిశధర్‌రెడ్డి, మహేందర్రెడ్డిలను విచారణకు పిలవాలని డిమాండ్ చేశానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకేం సంబంధం అని ఆయన అన్నారు.