91
అక్షర టుడే, ఎల్లారెడ్డి: Former MP BB Patil | సోమార్పేట్లో (Somarpet) జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులకు వైద్యానికి సాయమందిస్తానని మాజీ ఎంపీ బీబీపాటిల్ (Former MP B.B. Patil) పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మ, సత్తెమ్మను శుక్రవారం మాజీ ఎంపీ బీబీ పాటిల్ పరామర్శించారు. వారిని ఓదార్చి ఆస్పత్రి వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం తానే భరిస్తామని హామీ ఇచ్చారు.
Former MP BB Patil | రాజకీయ కక్షలు వద్దు..
రాజకీయ కక్షలతో ఇలాంటి దారుణాలకు ఒడికట్టవద్దని ఆయన సూచించారు. స్నేహపూర్వక రాజకీయాలు చేయాలని పేర్కొన్నారు. ఒకే ఊళ్లో కలిసి బతికే వాళ్లమని.. ఎన్నికల సమయంలో ఎన్నికల కోసం మాత్రమే పోటీపడాలి తప్ప ఎలాంటి కక్షలకు పోవద్దని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.