HomeతెలంగాణJaggareddy | అటెండర్​ పోస్ట్​ ఇచ్చినా హ్యాపీగా చేస్తా: జగ్గారెడ్డి

Jaggareddy | అటెండర్​ పోస్ట్​ ఇచ్చినా హ్యాపీగా చేస్తా: జగ్గారెడ్డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jaggareddy | కాంగ్రెస్​ ఫైర్​ బ్రాండ్​, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​(TPCC Working President) జగ్గారెడ్డి(Jagga reddy)కి పార్టీ అడ్వైజరి కమిటీలో చోటు దక్కిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను డిఫరెంట్​ అని అడ్వైజరీ కమిటీలో వేశారన్నారు. తనకు గాంధీ భవన్ (Gandhi Bhavan)​లో అటెండర్​ పోస్టు ఇచ్చిన హ్యాపీగా పనిచేస్తానని ఆయన తెలిపారు.

ఇందిరాగాంధీ (Indira Gandhi) గురించి మాట్లాడే అర్హత బీజేపీ(BJP)కి లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ గురించి ఇష్టారీతిగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మెదక్​ ఎంపీ రఘునందన్​రావు (MP Raghunandan Rao) రాహుల్​గాంధీపై పరిధి దాటి మాట్లాడారన్నారు. తాను కూడా ప్రధాని మోదీపై మాట్లాడగలనని, కానీ తనకు విజ్ఞత ఉందన్నారు.