అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyber Fraud | ఇల్లు అద్దె(House Rent)కు తీసుకుంటామని చెప్పి సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) ఓ మహిళకు టోకరా వేశారు. సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళ ప్లాట్ అద్దెకు ఇస్తామని ఆన్లైన్(Online)లో వివరాలు పెట్టింది. దీంతో సైబర్ నేరస్తుడు ఆమెకు ఫోన్ చేసి తాను ఆర్మీ అధికారినని నమ్మించాడు. ఆర్మీ చెల్లింపులు రివర్స్‌మోడ్(Reverse mode)లో ఉంటాయని చెప్పాడు. ముందు తన అకౌంట్లోకి డబ్బు పంపితే.. ఇంట్లో అద్దెకు దిగాక మొత్తం చెల్లిస్తానని నమ్మించాడు. దీంతో మహిళ నిందితుడి అకౌంట్లో రూ.లక్షా 31వేలు వేసింది. డబ్బులు పంపిన తర్వాత ఫోన్ స్విచ్చాఫ్(Phone switched off) రావడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు(Police) ఫిర్యాదు చేసింది.
