HomeతెలంగాణJany Lyri | చనిపోవాలని ఉంది.. ట్రోలింగ్​ ఆపండి.. బోరున ఏడ్చేసిన డ్యాన్సర్​ జాను

Jany Lyri | చనిపోవాలని ఉంది.. ట్రోలింగ్​ ఆపండి.. బోరున ఏడ్చేసిన డ్యాన్సర్​ జాను

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jany Lyri | ఫోక్​ డ్యాన్సర్​ folk dancer జాను లిరి januu lyri యూట్యూబ్​లో youtube చాలా ఫేమస్​. తన స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. తన డ్యాన్స్​ danceతో ప్రజలను ఆకట్టుకునే జాను ట్రోలర్ల trollers బాధ తట్టుకోలేకపోతున్నాని బోరున ఏడ్చేసింది. తన గురించి ఎందుకు చెడుగా వీడియోలు చేస్తున్నారని ప్రశ్నించింది. వ్యూస్​ కోసం ఇతరుల జీవితాలతో ఆడుకోవడం సరికాదని వాపోయింది. సూసైడ్ చేసుకుంటానంటూ ఆమె తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో వీడియో రిలీజ్​ చేసింది.

తనకు రెండో పెళ్లి అంటూ ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక అన్నతో మాట్లాడినా లింకులు పెడుతున్నారని ఆమె వాపోయింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తట్టుకోలేకపోతున్నానని విలపించింది. ఒక అమ్మాయి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నించింది. నేను కూర్చున్నా.. నిల్చున్నా ట్రోలింగ్​ చేస్తున్నారని వాపోయింది. తనను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఒక్క మాట అనకుండా పెంచారని, ఇప్పడు అడ్డమైన వారితో మాటలు పడుతున్నానని కన్నీటి పర్యంతమైంది. ‘ఇక నా జీవితం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు.. నేను చనిపోతే మీరే బాధ్యులు’ అంటూ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

Must Read
Related News