అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | నా కుటుంబం.. నా వ్యక్తిగత స్వార్థం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదని.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) తెలిపారు. పట్టణంలో గురువారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బాన్సువాడ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే సీఎంను కలిశానని వివరించారు. సీఎం దగ్గర నా స్వార్థం కోసం వెళ్లినట్లు నిరూపిస్తే.. రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ (former CM KCR) అడిగినన్ని అభివృద్ధి నిధులు బాన్సువాడకు మంజూరు చేశారని గుర్తు చేశారు.
నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నిధులు అవసరమని, అందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, బాన్సువాడ సొసైటీ ఛైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, వాహబ్, లింగం తదితరులు పాల్గొన్నారు.
