HomeUncategorizedCourt Movie Heroine | క‌వ‌ర్ సాంగ్ కోసం ముంబై రమ్మన్నారు.. భ‌య‌ప‌డి వెళ్ల‌లేద‌న్న కోర్ట్...

Court Movie Heroine | క‌వ‌ర్ సాంగ్ కోసం ముంబై రమ్మన్నారు.. భ‌య‌ప‌డి వెళ్ల‌లేద‌న్న కోర్ట్ బ్యూటీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Court Movie Heroine | కాకినాడ శ్రీదేవి.. ‘కోర్ట్’ Court movie సినిమా చూసినవారికి ఈ బ్యూటీ బాగా సుప‌రిచితం.

ఈవెంట్స్ లో ఈ అమ్మాయిని చూశారు గానీ, పెద్దగా పట్టించుకోలేదు. గ్లామరస్ గా కనిపించలేదు గానీ, ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ మాత్రం ఉందని అనుకున్నారు. శ్రీదేవి(Sridevi) ఇంతకుముందు ఒకటి రెండు సినిమాలలో చిన్నచిన్న వేషాలు వేసిందట . కాకినాడలో ఇంటర్ చదువుతూ.. రీల్స్ చేసుకుంటూ వెళుతున్న ఈ అమ్మాయికి అనుకోకుండా కోర్ట్ సినిమా(Court movie) అవ‌కాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఈ బ్యూటీ వదులుకోలేదు. ‘జాబిల్లి’గా తన పాత్రలో గొప్పగా నటించింది. ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్ట్ల కళ్లతోనే హావభావాలను పలికించింది. చిత్రంలో శివాజీ.. ప్రియదర్శి.. తరువాత ఎక్కువ మార్కులు శ్రీదేవికే దక్కుతాయి. తనే ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ.

Court Movie Heroine | భ‌య‌ప‌డ్డాను..

కాకినాడ(Kakinada) అమ్మాయి ఇంత గొప్పగా చేసిందా.. అని అంతా చెప్పుకుంటున్నారు. అంజలి Anjali.. స్వాతి.. ఆనంది వంటి తెలుగు హీరోయిన్స్ తరువాత, ఆ స్థాయిలో శ్రీదేవి జెండా ఎగరేస్తుంద‌ని అందరు ముచ్చ‌టించుకుంటున్నారు. ఆ మ‌ధ్య ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines) శ్రీదేవికి ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని శ్రీదేవినే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. “మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ సినిమా సూపర్ హిట్ అయినందుకు అభినందనలు అంటూ ఒక నోట్ తో పాటు ఒక జ్ఞాపికను కూడా శ్రీదేవికి బహుమతిగా ఇచ్చింది ఇండిగో సంస్థ.” ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది ముద్దుగుమ్మ‌.

ఇక టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ గోపిచంద్ మ‌లినేని, హ‌రీష్ శంక‌ర్‌లు Harish Shankar రానున్న రోజుల‌లో త‌న‌తో క‌లిసి సినిమాలు చేస్తామ‌ని మాట ఇచ్చార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రీదేవి. ఇక ఇదిలా ఉంటే శ్రీదేవి ఇటీవ‌ల మాట్లాడుతూ.. “ఒక బాలీవుడ్ సంగీత దర్శకుడు నన్ను సంప్రదించాడు. ఆయన నన్ను తనతో కవర్ సాంగ్ చేయమని అడిగారు . అయితే షూటింగ్ కోసం ముంబై (Mumbai) రావాల‌ని అన్నారు. నేను భయపడి వెళ్ళలేదు” అంటూ స్ప‌ష్టం చేసింది.