Homeతాజావార్తలుKonda Murali | నాకేం తెలియదు.. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు : కొండా...

Konda Murali | నాకేం తెలియదు.. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు : కొండా మురళి

మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారంపై కొండా మురళి స్పందించారు. తమకు సీఎం రేవంత్​రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Murali | మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్​పై ఆమె భర్త కొండా మురళి స్పందించారు. జరుగుతున్న పరిణామాలు తనకేం తెలియదని ఆయన వ్యాఖ్యలు చేశారు.

కొండా సురేఖ (Konda Surekha) ఓఎస్డీ సుమంత్ తొలగింపు, ఆయన అరెస్ట్​కు పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లిన విషయం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తన తండ్రిపై కుట్రలు జరుగుతున్నాయని ఆయన కుమార్తె సుష్మిత ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై కొండా మురళి స్పందించారు. మాజీ ఓఎస్డీ సుమంత్‌ విషయం తనకేమీ తెలియదని స్పష్టం చేశారు. మంత్రి ఛాంబర్‌కు తాను ఇప్పటి వరకు వెళ్లలేదని పేర్కొన్నారు.

Konda Murali | ఎమ్మెల్సీ ఇస్తామన్నారు..

నా కుమార్తె, అల్లుడు లండన్‌లో ఉన్నారని మురళి (Konda Murali) తెలిపారు. అక్కడ వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. తన బిడ్డకు పదవీ ఏమీ లేదన్నారు. భద్రతా కారణాలతో తాను, మంత్రి సురేఖ వేర్వేరు కార్లలో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. తనకు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం, మంత్రి పొంగులేటి తమ ఇంటికి వచ్చారని చెప్పారు. తనను ఎవరు టార్గెట్​ చేస్తారని ఆయన ప్రశ్నించారు.

కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తన బిడ్డకు మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు. ఆమె ఇబ్బంది పడ్డానని చెప్పిందని, అందుకే అలా మాట్లాడి ఉంటుందన్నారు. రేవంత్​రెడ్డి సీఎం కావాలని తాము ఎంతో కష్టపడ్డామన్నారు. సీఎంతో తమకు ఎలాంటి విబేధాలు లేవన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​, సీఎం రేవంత్ రెడ్డితో సమస్యపై మాట్లాడతానన్నారు. మీనాక్షి నటరాజన్​ను (Meenakshi Natarajan)​ కలిసి అన్ని విషయాలను ఆమెకు చెబుతామన్నారు.