అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KCR On SIT Notice | బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) సిట్ నోటీసులపై స్పందించారు. శుక్రవారం విచారణకు హాజరు కాలేనని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్‌కు గురువారం నోటీసులు (SIT Notice) ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కేసీఆర్ నివాసంలో సైతం విచారించడానికి అధికారులు ఓకే అన్నారు. అయితే నోటీసులపై తాజాగా కేసీఆర్ సిట్ అధికారులకు లేఖ రాశారు. రేపు విచారణకు హాజరుకాలేనని పేర్కొన్నారు.
KCR On SIT Notice | నామినేషన్లతో..
మున్సిపల్ ఎన్నికల (Municipal elections) నామినేషన్ల చివరి రోజు దృష్ట్యా సిట్ విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ తెలిపారు. తదుపరి విచారణ తేదీని నిర్ణయించాలని సిట్‌ను కోరారు. CrPC సెక్షన్ 160 ప్రకారం ఇంటి వద్దే విచారణ జరపాలని అభ్యర్థించారు. 65 ఏళ్లు దాటిన వారిని పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదని చట్టంలో ఉందన్నారు. ఎర్రవల్లి నివాసానికే వచ్చి విచారణ చేయాలని కోరారు. భవిష్యత్తు నోటీసులు సైతం నివాస చిరునామాకే పంపాలన్నారు.
సిట్ నోటీసులతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. నోటీసులపై కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌లో హరీశ్‌రావు (Harish Rao)తో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన విచారణకు హాజరు కాలేనని లేఖ రాశారు. దీంతో సిట్ అధికారులు మరో తేదిన ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉంది.