Homeతాజావార్తలుi-Bomma owner arrested | ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్.. విచార‌ణ‌లో బ‌య‌ట‌కు రానున్న...

i-Bomma owner arrested | ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్.. విచార‌ణ‌లో బ‌య‌ట‌కు రానున్న కీల‌క అంశాలు

పోలీసుల‌కి స‌వాల్ విసిరిన ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్ట‌కేల‌కి అరెస్టయ్యాడు. హైదరాబాద్ లోని కూకట్​పల్లిలో సీసీఎస్ పోలీసులు అత‌నిని అరెస్ట్ చేసి విచారిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: i-Bomma owner arrested | తెలుగు చిత్ర పరిశ్రమకు త‌ల‌నొప్పిగా మారిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ (ibomma)’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కూకట్‌పల్లి ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సీసీఎస్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 14న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ (Hyderabad) వచ్చిన వెంటనే అతను పోలీసుల రాడార్‌లో చిక్కినట్లు తెలుస్తోంది.

i-Bomma owner arrested | కరేబియన్ దీవుల్లో నుంచి పైరసీ ఆపరేషన్

ఇమ్మడి రవి (Immad Ravi) కరేబియన్ దీవులలో నివసిస్తూ అక్కడ నుంచి ఐబొమ్మ వెబ్‌సైట్‌ను (iBomma website) నిర్వహిస్తున్నాడు. థియేటర్లు మరియు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో విడుదలైన సినిమాలు గంటలోపే ఐబొమ్మ సైట్‌లో కనిపించడం వల్ల తెలుగు సినిమా నిర్మాతలు భారీ నష్టం ఎదుర్కొంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే నేపథ్యంలో కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అరెస్ట్ Arrest సమయంలో అతను ఒంటరిగా ఉంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇమ్మడి రవి బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న సుమారు రూ. 3 కోట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. అదేవిధంగా సర్వర్‌లలో ఉన్న మూవీ కంటెంట్‌ను కూడా పోలీసులు సీజ్ చేసి పరిశీలిస్తున్నారు.

గతంలో ‘దమ్ముంటే ప‌ట్టుకోండి’ అంటూ సవాల్ విసిరిన ఇమ్మడి రవి అరెస్ట్ సినిమా ఇండస్ట్రీలో (Cinema industry) పెద్ద చర్చకు దారితీసింది. ఇమ్మడి రవి అరెస్ట్ అనంతరం ఐబొమ్మ వెబ్‌సైట్ పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తాయి. సైట్ పూర్తిగా నిలిచిపోయిందా లేదా తాత్కాలికంగా మూతపడిందా అన్న వివరాలు త‌దుప‌రి విచార‌ణ‌లో తేలుతుంది. పోలీసులు సోమవారం మీడియా సమావేశంలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది కీలక పరిణామంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Must Read
Related News