Homeతాజావార్తలుIBomma Closed | ఐ- బొమ్మ, బప్పం వెబ్సైట్లు క్లోజ్​.. నిర్వాహకుడితోనే బంద్​ చేయించిన పోలీసులు

IBomma Closed | ఐ- బొమ్మ, బప్పం వెబ్సైట్లు క్లోజ్​.. నిర్వాహకుడితోనే బంద్​ చేయించిన పోలీసులు

ఐ–బొమ్మ, బప్పం వెబ్​సైట్లను తెలంగాణ సైబర్​ క్రైమ్​ పోలీసులు క్లోజ్​ చేయించారు. నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే వాటి సర్వర్లను బంద్​ చేయించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: IBomma Closed | తెలంగాణ సైబర్​ క్రైం పోలీసులు ఐ–బొమ్మ (I-Bomma), బప్పం వెబ్​సైట్లను క్లోజ్​ చేయించారు. తెలుగుతో పాటు వివిధ భాషల సినిమాలను పైరసీ చేసి ఐ బొమ్మ వెబ్​సైట్​లో (I-Bomma website) అప్​లోడ్​ చేస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. రవిని శనివారం న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో చంచల్ గూడ జైలు కు తరలించారు.

టాలీవుడ్​కు (Tollywood) తలనొప్పిగా మారిన ఐ–బొమ్మ వెబ్​సైట్​ను పోలీసులు బంద్ చేయించారు. రవి అరెస్ట్​ అనంతరం అతడితోనే ఐ- బొమ్మ, బప్పం వెబ్సైట్ సర్వర్లు క్లోజ్ చేయించారు. రవి సవాల్ స్వీకరించి.. అతనితోనే వెబ్సైటు క్లోజ్ చేయించడం గమనార్హం. రవి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు. అతడిని కస్టడీకి సైబర్ క్రైమ్ పోలీసులు (cyber crime police)  సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు.

IBomma Closed | అపార్ట్​మెంట్​లో సోదాలు

రవిని కూకట్​పల్లిలో అరెస్ట్​ చేసిన పోలీసులు.. ఆదివారం మరోసారి అతడు ఉండే అపార్ట్​మెంట్​లో సోదాలు నిర్వహించారు. రూ. 3 కోట్ల నగదు, వందల కొద్ది హార్డ్ డిస్క్లు, ల్యాప్ టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. కొత్త సినిమాలు డౌన్‌లోడ్ చేసి కరేబియన్ దీవులే (Caribbean islands) అడ్డాగా ఐ- బొమ్మలో అప్‌లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. రవి IBomma పేరుతో 70 కి పైగా మిర్రర్ సైట్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

IBomma Closed | అభినందించిన సీవీ ఆనంద్​

దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారని రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ (CV Anand) సిబ్బందిని అభినందించారు. కాగా గతంలో ఐ బొమ్మ నిర్వాహకుడు రవి దమ్ముంటే తనను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అతడిని అరెస్ట్​ చేయడంతో సీవీ ఆనంద్​ ఎక్స్​ వేదికగా సిబ్బందిని అభినందించారు. డీసీపీ కవిత, సీపీ సజ్జనార్​కు కంగ్రాట్స్ చెప్పారు.

Must Read
Related News