ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్ ట్యాపింగ్‌లో ఫ‌స్ట్ బాధితుడిని నేనే.. ఎంపీ ఈటల రాజేందర్

    Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్‌లో ఫ‌స్ట్ బాధితుడిని నేనే.. ఎంపీ ఈటల రాజేందర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Phone Tapping Case | రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపిన ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితుడిని తానేన‌ని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (BJP MP Etala Rajender) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ (BRS) హ‌యాంలో ఒక్కరోజే 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ (Phone Tapping) అయ్యాయ‌ని, అందులో ఈట‌ల రాజేంద‌ర్ ఫోన్ కూడా ఉంద‌ని వ‌చ్చిన వార్త‌ల‌పై ఆయ‌న స్పందించారు. గ‌త ప్ర‌భుత్వం త‌న కుటుంబ స‌భ్యులు, డ్రైవ‌ర్లు, గ‌న్‌మెన్ల ఫోన్ల‌ను కూడా ట్యాప్ చేయించింద‌ని వెల్ల‌డించారు. తామేం చేస్తున్నాం, ఎవరెవ‌రితో మాట్లాడుతున్నామ‌ని దొంగ‌చాటుగా తెలుసుకున్నార‌ని విమ‌ర్శించారు. త‌ప్పు చేసిన వారెవ‌రికైనా శిక్ష ప‌డాల్సిందేనని, ఎంత పెద్ద‌వారు ఉన్నా వారిని వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

    Phone Tapping Case | సిట్‌కు అన్ని ఆధారాలిస్తా..

    ఫోన్ ట్యాపింగ్‌పై విచార‌ణ (Phone Tapping Investigation) జ‌రుపుతున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) నుంచి త‌నకు మంగ‌ళ‌వారమే పిలుపు వ‌చ్చింద‌ని ఈట‌ల చెప్పారు. సిట్ ముందు తప్పకుండా హాజ‌ర‌వుతాన‌ని, త‌న‌ దగ్గర ఉన్న ఆధారాలతో అధికారులకు స్టేట్‌మెంట్ ఇస్తానని వెల్ల‌డించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట విరుద్ధమ‌ని, ఈ కేసులో ఎంతటి వారున్నా వారిని వదిలిపెట్టకూడదని కోరారు.

    Phone Tapping Case | క‌ల‌క‌లం రేపుతున్న ట్యాపింగ్ అంశం

    తెలంగాణలో (Telangana) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. సిట్ విచార‌ణ‌లో (SIT investigation) దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒకే రోజు 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారన్న వార్త రాష్ట్ర రాజ‌కీయాల్లో (state politics) సంచ‌ల‌నంగా మారింది. మావోయిస్టుల ముసుగులో ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీలోని కొందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసిన‌ట్లు స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా సిట్ గుర్తించింది. 2023, నవంబర్ 15న అంటే.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao), ప్రణీత్‌రావు టీం 600 మంది ఫోన్లను ట్యాప్ చేశారని వెలుగులోకి వచ్చింది. మావోయిస్టుల ముసుగు వేసి.. ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెల్లడైంది.

    ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress), బీజేపీ నాయకులతో (BJP Leaders) పాటు అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) చెందిన పలువురు నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన‌ట్లు తేలింది. ఈ జాబితాలో రేవంత్‌రెడ్డి (Reavanth Reddy), బీజేపీ ఎంపీలు అరవింద్ (MP Arvind), ఈట‌ల (MP Etala Rajender), రఘునందన్ (Raghunandan Rao) ఫోన్‌లతో పాటుగా.. పలువురు బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు కూడా ఉన్నాయని తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం బాధితుల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తోంది. బీజేపీ ఎంపీలు ఈట‌ల‌, అర్వింద్‌, ర‌ఘునంద‌న్‌ల‌ను కూడా సిట్ పిలిచింది.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...