- Advertisement -
Homeక్రీడలుVaibhav Suryavanshi | నాకు భయం లేదు.. సెంచరీ నా కల: వైభవ్ సూర్యవంశీ

Vaibhav Suryavanshi | నాకు భయం లేదు.. సెంచరీ నా కల: వైభవ్ సూర్యవంశీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vaibhav Suryavanshi | ఐపీఎల్‌లో సెంచరీ సాధించడం తన కల అని రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ‘సిక్సర’ పిడుగు, విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అన్నాడు. తనకు ఎలాంటి భయం లేదని, ఎక్కువగా ఆలోచించనని, ఆటపై మాత్రమే ఫోకస్ పెడుతానని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో ఈ 14 ఏళ్ల కుర్రాడు.. 35 బంతుల్లోనే సెంచరీ బాది వరల్డ్ రికార్డ్(World Record) నమోదు చేశాడు. 7 ఫోర్లు, 11 సిక్సర్లతో గుజరాత్ బౌలర్లను ఊచకోత కోసాడు.

ప్రొఫెషనల్ క్రికెట్‌(Professional Cricket)లో సెంచరీ బాదిన అతిపిన్న వయస్కుడిగా.. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా శతకం నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అతని సెంచరీతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 25 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఈ మ్యాచ్ అనంతరం తన సెంచరీపై మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ సంతోషం వ్యక్తం చేశాడు.

- Advertisement -

‘చాలా సంతోషంగా ఉంది. ఇది నాకెంతో ప్రత్యేకమైన అనుభూతి. ఐపీఎల్‌(IPL)లో ఇదే నా తొలి సెంచరీ. అలానే ఇది నాకు మూడో ఇన్నింగ్స్. టోర్నీ ముందు చేసిన కఠినమైన ప్రాక్టీస్ ఫలితమే ఈ సెంచరీ. నేను కేవలం బంతిని చూసి మాత్రమే బాదుతాను. అది చిన్న గ్రౌండా? పెద్దదా? అనేది నాకు అనవసరం. జైస్వాల్‌(Jaiswal)తో కలిసి బ్యాటింగ్ చేయడం బాగుంటుంది.

అతను నాకు ఎలా ఆడాలో చెప్తాడు. నాలో సానుకూల దృక్పథాన్ని నింపుతాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేయడం నా డ్రీమ్(Dream). ఆ కల ఈ రోజు నెరవేరింది. నాకు భయం లేదు. నేను ఎక్కువగా ఆలోచించను. నా ఆటపై మాత్రమే దృష్టి పెడుతాను. క్రికెటర్ కావాలనేది మా నాన్న కల. ఆ కలను నా ద్వారా నెరవేర్చుకుంటున్నాడు. చిన్న వయసులోనే క్రికెట్ ఆడటం మొదలు పెట్టాను. 4 ఏళ్ల వరకు ఇంట్లోనే ఆడాను. ఆ తర్వాత క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాను.’అని వైభవ్ సూర్య వంశీ చెప్పుకొచ్చాడు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News