ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | నా స్కూల్‌ బీజేపీలో, కాలేజీ టీడీపీలో.. ఉద్యోగం రాహుల్‌ గాంధీ...

    CM Revanth Reddy | నా స్కూల్‌ బీజేపీలో, కాలేజీ టీడీపీలో.. ఉద్యోగం రాహుల్‌ గాంధీ వద్ద చేస్తున్నా.. సీఎం రేవంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా స్కూల్‌ చదువు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో (TDP).. ఉద్యోగం రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) వద్ద చేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్​లోని (Hyderabad) శిల్పకళావేదికలో జరిగిన హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ (Bandaru dattathreya) ఆటో బయోగ్రఫీ ‘ప్రజలకథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణలో సీఎం మాట్లాడారు. బండారు దత్తాత్రేయ గౌలిగూడ గల్లి నుంచి హరియాణా గవర్నర్‌ (Haryana Governor) వరకు ఎదిగారన్నారు. పదవి ఉన్నా లేకపోయినా ఆయనపై గౌరవం ఏ మాత్రం తగ్గదని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ ఆయనను గౌరవిస్తారని చెప్పారు.

    CM Revanth Reddy | ప్రజలతో మంచి సంబంధాలు

    బండారు దత్తాత్రేయకు సాధారణ ప్రజలతో మంచి అనుబంధం ఉందని సీఎం (CM) పేర్కొన్నారు. ప్రజలు జరుపుకునే వేడుకల్లో ఆయన భాగమయ్యేవారని గుర్తు చేశారు. నాకు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి (Kishan reddy) కుటుంబాలతో నాకు సన్నిహిత సంబంధాలున్నాని రేవంత్ రెడ్డి చెప్పారు. నీతి ఆయోగ్​ సమావేశంలో ఒకసారి ప్రధాని మోదీ (PM Modi) నాకు చంద్రబాబు నాయుడును (Chnadra Babu Naidu) చూపించి ‘ఆప్​కి సాతీ ఇదర్​ హై’ అన్నారని అప్పడు నేను స్పందిస్తూ.. నా స్కూల్‌ చదువు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో.. ఉద్యోగం రాహుల్‌ గాంధీ (rahul gandhi) వద్ద చేస్తున్నా అని ప్రధానికి చెప్పానని గుర్తు చేశారు.

    CM Revanth Reddy | దత్తాత్రేయను చూసి ఎంతో నేర్చుకోవాలి

    తాము రాజకీయంగా (Politics) భిన్న మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ వ్యక్తిగత సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ప్రయత్నం చేయడం లేదని రేవంత్​ రెడ్డి (Revanth reddy) పేర్కొన్నారు. దత్తాత్రేయ చూసి ఎంతో నేర్చుకోవాలని.. ప్రజలతో సంబంధాలు కలిగి ఉండడంలో ఆయన అజాతశత్రువు అని పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ (Atal bihari vaj) పేయి జాతీయ రాజకీయాల్లో పదవుల్లో ఉన్నా లేకున్నా వారి గౌరవం ఎప్పుడూ తగ్గలేదు. అలాగే దత్తాత్రేయను కూడా అదే తీరుగా గౌరవిస్తారని చెప్పారు. జంట నగరాల ప్రజలకు ఏ బాధ ఉన్న వినడానికి ఇద్దరు నాయకుల పేర్లు వినిపిస్తాయి. ఖైరతాబాద్ పి.జనార్దన్ రెడ్డి (P.janardhan reddy), బండారు దత్తాత్రేయ వీరిద్దరూ జంట నగరాల నేతలన్నారు. మంత్రివర్గ విస్తరణ ఉన్నా.. ఆ కార్యక్రమం పూర్తికాగానే దత్తాత్రేయ కోసం ఇక్కడికి వచ్చానని చెప్పారు.

    కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...