Homeబిజినెస్​Hyundai Venue | హ్యుందాయ్‌ కొత్త వెన్యూ.. లాంచింగ్‌ ఎప్పుడంటే?

Hyundai Venue | హ్యుందాయ్‌ కొత్త వెన్యూ.. లాంచింగ్‌ ఎప్పుడంటే?

హ్యుందాయ్‌ వెన్యూ కారు కొత్త మోడల్​లో మార్కెట్లోకి రానుంది. నవంబర్‌ 4న దీనిని లాంచ్‌ చేయనున్నారు. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమైన ఈ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyundai Venue | హ్యుందాయ్‌ వెన్యూ కొత్త రూపంలో మళ్లీ వస్తోంది. నవంబర్‌ 4న దీనిని లాంచ్‌ చేయనున్నారు. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమైన ఈ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ(SUV).. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కాంపాక్ట్‌ ఎస్‌యూవీ(Compact SUV) అయిన వెన్యూ హ్యుందాయ్‌ కంపెనీకి సంబంధించి భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచింది. హ్యుందాయ్‌ వెన్యూ 2019లో లాంచ్‌ అయ్యింది. అప్పటి నుంచి భారత్‌లో 7 లక్షలకుపైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ మోడల్‌ను సరికొత్తగా తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 7.26 లక్షల నుంచి రూ. 12.46 లక్షల వరకు ఉండనుంది. ఇది టాటా నెక్సాన్‌(Tata Nexon), మారుతి సుజుకీ బ్రెజ్జా, కియా సోనెట్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ300తో పోటీ పడుతుందని భావిస్తున్నారు. కొత్త వెన్యూ ఫీచర్స్‌ తెలుసుకుందామా..

Hyundai Venue | ఎక్స్‌టీరియర్‌..

2025 వెన్యూ పాత మోడల్‌ కంటే ఎత్తుగా, వెడల్పుగా ఉంటుంది. దీని వీల్‌బేస్‌(Wheel base) కూడా పెరిగింది. దీంతో క్యాబిన్‌ స్పేస్‌ మరింత విస్తృతంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉన్న వెన్యూ కంటే మొత్తం 48 మిల్లీ మీటర్ల ఎత్తు, 30 మిల్లీమీటర్ల వెడల్పు పెరగడం వల్ల రోడ్డుపై మరింత బలమైన లుక్‌ ఇస్తుంది. కొత్త వెన్యూ బాడీ ప్రపోర్షన్స్‌ కూడా మారాయి. ట్విన్‌ హార్న్‌ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, క్వాడ్‌ బీమ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంపులు, డార్క్‌ క్రోమ్‌ రేడియేటర్‌ గ్రిల్‌, ఇన్‌ గ్లాస్‌ వెన్యూ లోగో ఉన్నాయి. డిజైన్‌లో బ్రిడ్జ్‌ టైప్‌ రూఫ్‌ రైల్స్‌, మస్క్యులర్‌ వీల్‌ ఆర్చెస్‌, 16 అంగుళాల డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌(Alloy Wheels) ఉన్నాయి.

Hyundai Venue | ఇంటీరియర్‌..

అంతర్గతంగా కొత్త హ్యుందాయ్‌ వెన్యూ హెచ్‌ ఆర్కిటెక్చర్‌ డాష్‌బోర్డ్‌ డిజైన్‌తో వస్తోంది. రెండు 12.3 అంగుళాల పనోరమిక్‌ కర్వ్డ్‌ డిస్‌ప్లే(Panoramic Curved Display)లున్నాయి. వీటిలో డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ రెండూ కలిపి ఉంటాయి. కీ ఫీచర్లలో డ్యుయల్‌ టోన్‌ లెదరేట్‌ సీట్లు వెన్యూ బ్రాండిరగ్‌తో, మూన్‌ వైట్‌ అంబియెంట్‌ లైటింగ్‌, కాఫీ టేబుల్‌ స్టైల్‌ సెంటర్‌ కన్సోల్‌, టెర్రాజో టెక్స్చర్‌ డాష్‌ ఫినిష్‌, రియర్‌ ఏసీ వెంట్స్‌, రియర్‌ సన్‌షేడ్స్‌, రెండు స్టెప్స్‌లో రీక్లైన్‌ అయ్యే రియర్‌ సీట్లు, ఎలక్ట్రిక్‌ 4 వే అడ్జస్టబుల్‌ డ్రైవర్‌ సీటు ఉన్నాయి. పొడిగించిన వీల్‌బేస్‌ వల్ల వెనక సీట్లలో లెగ్‌రూమ్‌ పెరుగుతుంది.

Hyundai Venue | ఇంజిన్‌..

ఇంజిన్‌ ఆప్షన్లలో మూడు వేరియంట్లున్నాయి. 1.2 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 83పీఎస్‌ పవర్‌, 114 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 120 పీఎస్‌ పవర్‌, 172 ఎన్‌ఎం టార్క్‌ను, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ 116 పీఎస్‌ పవర్‌, 250 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ట్రాన్స్‌మిషన్‌లో మాన్యువల్‌, ఆటోమేటిక్‌, డ్యుయల్‌ క్లచ్‌(డీసీటీ) గేర్‌బాక్స్‌ ఎంపికలుంటాయి. వేరియంట్లు హెచ్‌ఎక్స్‌2, హెచ్‌ఎక్స్‌4, హెచ్‌ఎక్స్‌5, హెచ్‌ఎక్స్‌6, హెచ్‌ఎక్స్‌6టి, హెచ్‌ఎక్స్‌7, హెచ్‌ఎక్స్‌8, హెచ్‌ఎక్స్‌10 అని ఉంటాయి.

Hyundai Venue | కలర్స్‌..

కొత్త వెన్యూ (Hyundai Venue) ఆరు మోనోటోన్‌, రెండు డ్యుయల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్లలో వస్తుంది. కొత్త కలర్స్‌ హేజల్‌ బ్లూ, మిస్టిక్‌ సఫైర్‌, హేజల్‌ బ్లూ విత్‌ అబిస్‌ బ్లాక్‌ రూఫ్‌ కాంబినేషన్‌ ఉన్నాయి. ఇతర రంగులు అట్లాస్‌ వైట్‌, టైటాన్‌ గ్రే, డ్రాగన్‌ రెడ్‌, అబిస్‌ బ్లాక్‌ ఉన్నాయి.

Hyundai Venue | ముందస్తు బుకింగ్‌కు అవకాశం..

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ వెన్యూలో 2025 మోడల్‌కు ముందస్తు బుకింగుల(Bookings)ను ప్రారంభించింది. ఆసక్తిగలవారు ఏ హ్యుందాయ్‌ షోరూమ్‌లోనైనా రూ. 25 వేలు చెల్లించి, లేదా క్లిక్‌ టు బై ప్లాట్‌ఫాం ద్వారా కూడా న్యూ వెన్యూ వాహనాన్ని బుక్‌ చేసుకోవచ్చు.

Must Read
Related News