Homeజిల్లాలుహైదరాబాద్Hydraa | వరద ముంపు నివారణే లక్ష్యంగా హైడ్రా కీలక చర్యలు

Hydraa | వరద ముంపు నివారణే లక్ష్యంగా హైడ్రా కీలక చర్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్​ (Hyderabad) నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతారు. చిన్న వర్షం పడ్డా నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునుగుతాయి. రహదారులపై నీరు నిలిచి గంటల కొద్ది ట్రాఫిక్​ జామ్​ అవుతోంది. నాలాలు, చెరువుల ఆక్రమణతో ఈ దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా (Hydraa) నగరంలో వరద ముంపు నివారణ కోసం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నాలాలపై ఆక్రమణలను తొలగిస్తోంది.

Hydraa | నాలాను పరిశీలించిన హైడ్రా కమిషనర్​

మాసబ్​ చెరువు – దిలావర్ఖాన్ – పెద్దఅంబర్​పేట చెరువులను అనుసంధానం చేసే నాలాను ఒక మోడల్​గా తీర్చిదిద్దుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) తెలిపారు. మొత్తం 7.50 కిలోమీటర్ల మేర ఈ నాలా ఉందన్నారు. అయితే తగిన వెడల్పుతో నాలాను నిర్మిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని చెప్పారు. రెవెన్యూ, GHMC, ఇరిగేషన్ శాఖలన్నింటితో సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ నాలా విస్తరణకు ప్రణాళికను రూపొందిస్తామని ఆయన తెలిపారు.

మాసబ్ చెరువు(Masab Pond) – దిలావర్ఖాన్ చెరువుల మధ్య నాలా సరిగ్గా లేక అనేక కాలనీలు నీట మునుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డితో (MLA Malreddy Rangareddy) కలిసి కమిషనర్​ బుధవారం పలు ప్రాంతాలను పరిశీలించారు.

Hydraa | పూర్తిస్థాయిలో అభివృద్ధి

చెరువుల మధ్య అనుసంధానంగా ఉన్న వరద కాల్వలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్​ పేర్కొన్నారు. అలాగే చెరువుల ఆక్రమణ జరగకుండా చూడాలని ఆదేశించారు. చెరువుల్లో మట్టి పోసి నింపినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాసబ్ చెరువులో మట్టి పోసినవారిపై చర్యలుంటాయన్నారు. అనంతరం కర్మాన్​ఘాట్, బడంగ్​పేట ఏరియాల్లో నాలా విస్తరణకు ఉన్న ఆటంకాలను పరిశీలించారు. కర్మాన్​ఘాట్ ప్రాంతంలోని ఉదయ్​ నగర్ కాలనీలో నాలాను వెంటనే విస్తరించాలని హైడ్రా కమిషనర్​ సూచించారు. అనంతరం ఆయన రావిర్యాల చెరువును పరిశీలించారు. చెరువు పైభాగంలో పలు ఇళ్లు నీట మునుగుతున్న నేపథ్యంలో అలుగులను పరిశీలించారు.

Must Read
Related News