అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భూములు (government lands), చెరువులు, పార్కులను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది. తాజాగా మియాపూర్లో భారీ ఆపరేషన్ చేపట్టింది.
రంగారెడ్డి జిల్లా (Ranga Reddy district) శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్ పేటలో ఆక్రమణలను శుక్రవారం హైడ్రా తొలగించింది. సర్వే నంబర్ 44 లో 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కాపాడింది. ఈ సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి అవుతున్నట్టు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు అందింది. దీంతో గతంలో హైడ్రా అధికారులు (HYDRA officials) 5 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ – బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై 200మీటర్ల మేర వేసిన 18 షెట్టర్లను గతంలోనే తొలగించింది. తాజాగా మరో 15 ఎకరాల భూమిని కాపాడింది. ఈ భూమిని కొందరు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హైడ్రా కాపాడిన భూమి విలువ రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
Hydraa | జలమండలి భూమి..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB)కి చెందిన 4.01 ఎకరాల భూమిని హైడ్రా పరిరక్షించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా (Medchal-Malkajgiri district) కీసర మండలం, రాంపల్లి గ్రామంలోని జలమండలి అవసరాల కోసం ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. కొందరు ఈ భూమిని ఆక్రమించుకొని ప్రహరీ నిర్మించే యత్నం చేశారు. దీనిపై జలమండలి అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించారు. జలమండలి భూమిగా నిర్ధారించుకొని శనివారం 4.01 ఎకరాల భూమి చుట్టూ కంచెను హైడ్రా ఏర్పాటు చేసింది.