అక్షరటుడే, వెబ్డెస్క్ : Tellapur Lake | సంగారెడ్డి జిల్లా (Sangareddy District) తెల్లాపూర్ చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు శుక్రవారం కూల్చివేశారు. చెరువులో ఆక్రమణలను తొలగించారు.
తెల్లాపూర్ చెరువులో మట్టి పోసి కొందరు ఆక్రమించారు. దీనిపై గతంలో హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఈ నెల 17న హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) చెరువును పరిశీలించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో మట్టి పోయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల స్వరూపాన్ని మార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మట్టి పోసి నింపడానికి అవకాశం లేకుండా ఫెన్సింగ్ వేయాలని సూచించారు. ఈ క్రమంలో చెరువులో నిబంధనలకు విరుద్ధంగా మట్టిపోసి చేపట్టిన నిర్మాణాలను శుక్రవారం హైడ్రా సిబ్బంది తొలగించారు. ఇలాంటి ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tellapur Lake | ఆక్రమణలపై ఉక్కుపాదం
హైడ్రా అధికారులు (Hydraa Officers) ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. చెరువులు, నాలాలతో పాటు ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లను కబ్జా చెరల నుంచి విడిపిస్తున్నారు. రంగరెడ్డి జిల్లా అబ్దుల్పూర్మెట్ మండలం పెద్దంబర్పేట విలేజ్ (Peddamberpet Village)లో ఓ లే ఈవుట్లోకి చొరబడి రహదారులను ఆక్రమించేసి నిర్మించిన ప్రహరీని గురువారం తొలగించారు. 265 సర్వే నంబరులో 278 ప్లాట్లతో శబరిహిల్స్ పేరిట లే అవుటు వేశారు. దీనికి ఆనుకుని 346 సర్వే నంబరులో ఎకరం భూమి కొన్న వ్యక్తి లే అవుట్లోని 20 ప్లాట్ల మేర రోడ్డును ఆక్రమించాడు. దీనిపై ప్లాట్ల యజమానులు హైడ్రా ప్రజావాణి (Hydraa Prajavani)లో ఫిర్యాదు చేయగా.. క్షేత్ర స్థాయిలో సిబ్బంది పరిశీలన చేపట్టారు. లే అవుట్లోకి 4 వేల గజాల వరకు జరిగినట్టు నిర్ధారించుకుని.. రహదారులకు ఆటంకంగా ఉన్న ప్రహరీలను తొలగించించారు.