అక్షరటుడే, వెబ్డెస్క్: HYDRAA Demolition Drive | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది.నగరంలోని నార్సింగి మున్సిపాలిటీ (Narsingi Municipality) పరిధిలోని అరుణోదయ హౌసింగ్ సొసైటీకి చెందిన సుమారు 1600 గజాల పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. దీంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. అనంతరం పార్క్ కబ్జాకు గురైనట్లు నిర్దారించుకొని సోమవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. సుమారు రూ.50 నుంచి 80 కోట్ల విలువైన పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. పార్కు స్థలాల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు (Hydraa Officers) హెచ్చరించారు.
HYDRAA Demolition Drive | అమీన్పూర్లో..
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చక్రపురి కాలనీలో ఉన్న 1253.8 గజాల పార్క్ స్థలాన్ని హైడ్రా ఆదివారం కాపాడింది. దీని విలువ రూ.7 కోట్ల విలువ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పార్కు ఆక్రమణలకు గురవుతోందని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. దీంతో పరిశీలన చేపట్టిన అధికారులు పార్కు కోసం కేటాయించిన స్థలం సరిహద్దు రాళ్లు తొలగించినట్టు గుర్తించారు. అనంతరం ఆ స్థలంలో ఆక్రమణలను తొలగించి, ఫెన్సింగ్ వేసింది.హైడ్రా అధికారులు ప్రతి సోమవారం కార్యాలయంలో ప్రజావాణి (Prajavani) నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రతి శనివారం ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా ప్రారంభించారు. వీటికి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వేగంగా స్పందిస్తున్నారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను సైతం పరిష్కరిస్తున్నారు. దీంతో ప్రజలు సైతం తమ ప్రాంతాల్లో ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు.
1 comment
[…] కార్యాలయం (Hydraa Office)లో ప్రతి సోమవారం ప్రజావాణి […]
Comments are closed.