అక్షరటుడే, హైదరాబాద్: Hydraa Commissioner Ranganath | గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. స్వాధీనం చేసిన స్థలాల విలువ సుమారు రూ. 70 వేల కోట్లకు పైగా ఉంటుందన్నారు.
Hydraa Commissioner Ranganath | విద్యా సంస్థల ఏర్పాటు..
హైడ్రా స్వాధీనం చేసుకున్న స్థలాలను దశలవారీగా ప్రజా ఉపయోగానికి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న స్థలాలపై కోర్టు కేసులను చట్టపరంగా ఎదుర్కొని, క్లియరెన్స్ వచ్చాకనే ప్రజా ప్రయోజనానికి వినియోగిస్తున్నామన్నారు.
కొండాపూర్ రాజేశ్వరి కాలనీలో కాపాడిన ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిలో సర్కారు విద్యా సంస్థలు, ఉద్యానాలు నిర్మించేలా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని కమిషనర్ తెలిపారు.
