Homeజిల్లాలుహైదరాబాద్Hydraa | నాలా ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం.. చింతల్​బస్తీలో నిర్మాణాల కూల్చివేత

Hydraa | నాలా ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం.. చింతల్​బస్తీలో నిర్మాణాల కూల్చివేత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో నాలాల ఆక్రమణలపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. వర్షాకాలం రావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తుతోంది. నాలాల ఆక్రమణలతోనే కాలనీల్లోకి వరద నీరు వస్తోందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం చింతల్​బస్తీ (Chintal Basti)లో నాలా ఆక్రమణలను హైడ్రా తొలగించింది.

బంజారాహిల్స్ (Banjarahills) రోడ్ నెంబర్ 12 వద్ద ఉన్న కల్వర్టుకు చింతల బస్తీ వైపు ఆక్రమణలు జరిగాయి. మొత్తం 15 మీటర్ల వెడల్పు కల్వర్టు కింద ఉండగా చింతలబస్తీ వైపు 7 మీటర్ల మేర కబ్జా జరిగినట్టు నిర్ధారణకు వచ్చిన హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించారు. ఇసుక, చిన్న సిమెంట్ దుకాణంతో పాటు కల్లు కాంపౌండ్ రేకుల షెడ్డును తొలగించారు. పింఛను ఆఫీసు వద్ద ఉన్న కల్వర్టును పూర్తి స్థాయిలో హైడ్రా విస్తరిస్తోంది. శంకర్​పల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి మొదలై నాగులపల్లి, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, మెహిదీపట్నం, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, చింతలబస్తీ, తుమ్మలబస్తీ మీదుగా హుస్సేన్ సాగర్ కలిసే చారిత్రక బుల్కాపూర్ నాలా సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు.

Must Read
Related News