ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Hydraa | చ‌ర్ల‌ప‌ల్లి చెరువు ఆధునికీకరణకు హైడ్రా చర్యలు

    Hydraa | చ‌ర్ల‌ప‌ల్లి చెరువు ఆధునికీకరణకు హైడ్రా చర్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని చ‌ర్ల‌ప‌ల్లి చెరువు (Charlapalli Lake) రూపు రేఖ‌లు మార‌నున్నాయి. జైళ్ల శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ సౌమ్య మిశ్రా ఆహ్వానం మేర‌కు హైడ్రా క‌మిష‌న‌ర్(Hydraa Commissioner) ఏవీ రంగ‌నాథ్ గురువారం చ‌ర్ల‌ప‌ల్లి చెరువును సంద‌ర్శించారు. జైళ్ల శాఖ‌, హైడ్రాతో పాటు.. స్థానిక రెవెన్యూ, ఇరిగేష‌న్‌, జీహెచ్ ఎంసీ అధికారులు కూడా ఈ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. చ‌ర్ల‌ప‌ల్లి జైలు ప్రాంతంలో ఉన్న 58 ఎక‌రాల చెరువును ఆధునికీక‌రించ‌డంతో పాటు సుంద‌రంగా తీర్చిదిద్ద‌డంపై ఉన్న‌తాధికారులు చ‌ర్చించారు.

    Hydraa | అభివృద్ధి చేయడానికి చర్యలు

    చెరువు చుట్టూ తిరిగి.. ఇన్‌లెట్‌, ఔట్‌లెట్‌ల‌ను ప‌రిశీలించారు. ప్ర‌స్తుతం చెరువులో కొద్దిమొత్తం నీరు ఉన్నా ప‌రిశుభ్రంగా ఉండ‌డంతో జీవ‌వైవిద్యానికి అవ‌కాశం ల‌భించింద‌ని.. ఇంకా ఈ చెరువు నిండా నీరుంటే మ‌రింత ఆహ్లాదంగా మారుతుంద‌ని భావించారు. ఈ క్ర‌మంలో చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి.. ప‌ర్యాట‌క‌, విహార కేంద్రంగా తీర్చిదిద్ద‌డంపై చ‌ర్చించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు.. క‌ట్ట‌ను బ‌లోపేతం చేసి పాత్‌వేను అభివృద్ధి చేయ‌డం వంటి పనులు వెంట‌నే చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. అలాగే సోలార్ లైటింగ్ సిస్టమ్‌తో పాటు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మ‌రింత భ‌ద్ర‌త ఉంటుంద‌ని భావించారు.

    హ‌కీంపేట నుంచి నాగిరెడ్డి కుంట‌, కాప్రా చెరువు, మోతుకుల‌కుంట‌, బైస‌న్‌కుంట గొలుసుక‌ట్ట‌ చెరువుల ద్వారా చ‌ర్ల‌ప‌ల్లి చెరువుకు నీరందుతుంది. ఈ చెరువుకు.. మురుగు నీరు క‌ల‌వ‌కుండా డైవ‌ర్ట్ నాలా కూడా ఉంది. చెరువు చుట్టూ దాదాపు మూడు కిలోమీట‌ర్ల మేర న‌డ‌క దారి అందుబాటులోకి వ‌స్తుంది. చ‌ర్ల‌ప‌ల్లి ప‌రిశ్ర‌మ‌లకు చెందిన ప్ర‌తినిధులు సామాజిక బాధ్య‌త (సీఎస్ఆర్‌) కింద నిధులు స‌మ‌కూర్చ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని సౌమ్య మిశ్రా చెప్పారు. ఒక్కో సెగ్మెంట్‌కు ఎంత ఖ‌ర్చు అవుతుందో స‌మ‌గ్ర నివేదిక ఇస్తే ఆ క్ర‌మంలో సీఎస్ఆర్ నిధులు అడ‌గ‌డానికి వీలవుతుంద‌న్నారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...