అక్షరటుడే, వెబ్డెస్క్: హైదరాబాద్ నగరంలో ఆక్రమణలపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను (government lands) కబ్జాల నుంచి కాపాడుతోంది. ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను సైతం పలువురు ఆక్రమిస్తుండగా.. స్థానికుల ఫిర్యాదు మేరకు వాటికి సైతం విముక్తి కల్పిస్తోంది. తాజాగా ఓ పార్క్ స్థలాన్ని హైడ్రా కాపాడింది.
రంగారెడ్డి జిల్లా (Rangareddy district) సరూర్‌నగర్ మండలం కర్మాంగట్ గ్రామంలోని సాయి గణేశ్ నగర్‌లో పార్కును హైడ్రా బుధవారం కాపాడింది. 1979లో మొత్తం 176 ప్లాట్లతో సాయి గణేష్ నగర్ లే అవుట్ వేశారు. దాదాపు 450 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. ఇటీవల కొంతమంది వ్యక్తులు ఈ పార్కు స్థలాన్ని (park land) ఆక్రమించి గది నిర్మాణం చేపట్టారు. వారిని ప్రశ్నించిన కాలనీ వాసులను బెదిరించారు.
Hydraa | కాలనీవాసుల ఫిర్యాదుతో..
పార్క్ స్థలం కబ్జాపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. పార్కు స్థలంపై చిన్న గది, గోడ వంటి అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు. సంబంధిత వ్యక్తులు సమర్పించిన పత్రాలను పరిశీలించి, అక్రమ నిర్మాణం అని నిర్ధారించారు. హైడ్రా అధికారులు (Hydra officials) బుధవారం అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రాకు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.
