ePaper
More
    HomeతెలంగాణHydraa | రూ.400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

    Hydraa | రూ.400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్(Hyderabad)​ నగరంలో రూ.400 కోట్ల విలువైన భూములను హైడ్రా కాపాడింది. ఆయా భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేసింది. నగరంలో ప్రభుత్వ భూములు, చెరువులు, రోడ్లు, పార్కుల రక్షణ కోసం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

    రంగారెడ్డి జిల్లా(Rangareddy District) శేరిలింగంప‌ల్లి మండ‌లం మాదాపూర్ ప్రాంతంలో జూబ్లీ ఎన్‌క్లేవ్‌ ఉంది. ఈ ఎన్ క్లేవ్​లో రోడ్లతో పాటు పార్కులున ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టారు. 22.20 ఎక‌రాల్లో సుమారు 100 ప్లాట్లతో ఈ లేఅవుట్​(Lay Out)కు అనుమతి తీసుకున్నారు. ఇందులో నాలుగు పార్కులు ఉండగా రెండింటిని కబ్జా చేశారు. దాదాపు 8500 గజాల పార్కులను ఆక్రమించారు. అంతేగాకుండా ఐదు వేల గజాల మేర రోడ్డును సైతం కబ్జా చేశారు.

    Hydraa | ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో..

    లే అవుట్​లో పార్క్​లు, రోడ్లు, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని స్థానికులు హైడ్రా ప్రజావాణి(Prajawani)కి ఫిర్యాదులు చేశారు. జైహింద్‌రెడ్డి లే అవుట్​లని పార్క్​ స్థలాలు, రోడ్లు ఆక్రమించారని పేర్కొన్నారు. అంతేగాకుండా హైటెక్ సిటీ– కొండాపూర్(Kondapur) మార్గంలో 300 గ‌జాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి హోటల్ నిర్మించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. ఆక్రమణలు నిజమేనని తేలడంతో గురువారం కూల్చివేతలు చేపట్టారు.

    పార్కులు, రోడ్లు ఆక్రమించి నిర్మించిన షెడ్లను తొలగించారు. అలాగే ప్రభుత్వ స్థలంలో నిర్మించిన హోటల్​ను సైతం కూల్చి వేశారు. మొత్తం 16 వేల గజాల స్థలాన్ని హైడ్రా(Hydraa) గురువారం కాపాడింది. ఈ స్థలం విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పార్క్​ స్థలాన్ని హైడ్రా కాపాడినట్లు అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అంతేగాకుండా సదరు భూమి చుట్టూ ఫెన్సింగ్​ ఏర్పాటు చేశారు. దీంతో జూబ్లీ ఎన్​క్లేవ్(Jubilee Enclave)​ వాసులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు

    Latest articles

    Earth Store | హైదరాబాద్‌లో సందడి చేసిన శ్రియా.. ‘అర్థ్’ స్టోర్​ను ప్రారంభించిన నటి..

    అక్షరటుడే, హైదరాబాద్ : Earth Store | సినీ నటి శ్రియా(Actress Shriya) హైదరాబాద్​లో సందడి చేసింది. కొండాపూర్‌లోని...

    CP Sai Chaitanya | పెయిడ్​ పార్కింగ్​ ఏరియా రాజీవ్​గాంధీ ఆడిటోరియం: సీపీ

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | ఖలీల్​వాడిలో (Khalilwadi) ట్రాఫిక్​ రద్దీని క్రమబద్ధీకరిస్తున్నామని సీపీ సాయిచైతన్య...

    SP Rajesh Chandra | మహిళకు ఉరి కేసులో ఒకరి అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | మహిళను చీర కొంగుతో ఉరివేసి హత్య చేసిన నిందితుడిని...

    BHEL Notifications | బీహెచ్‌ఈఎల్‌లో ఇంజినీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. ఈనెల 28తో ముగియనున్న దరఖాస్తు గడువు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BHEL Notifications | భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(BHEL) మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాలలో...

    More like this