ePaper
More
    HomeతెలంగాణHydraa Police Station | ఆక్రమణదారులను అడ్డుకోవడానికే హైడ్రా: సీఎం రేవంత్​ రెడ్డి

    Hydraa Police Station | ఆక్రమణదారులను అడ్డుకోవడానికే హైడ్రా: సీఎం రేవంత్​ రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Police Station | ఆక్రమణదారులను అడ్డుకోవడానికి హైడ్రా ఏర్పాటు చేశామని సీఎం రేవంత్​ రెడ్డి (CM revanth reddy) స్పష్టం చేశారు. చెరువులు ఆక్రమించిన వ్యక్తులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. గురువారం ఆయన హైదరాబాద్​లో హైడ్రా పోలీస్​స్టేషన్ (hyderabad hydra Police Station)​, వెబ్​సైట్​ను ప్రారంభించారు.

    అనంతరం సీఎం (CM revanth reddy) మాట్లాడుతూ.. హైదరాబాద్​లో చిన్న వర్షం కురిస్తే రోడ్లపై గంటల తరబడి నీరు నిలిచిపోతుందన్నారు. నాలాల ఆక్రమణల వల్లే నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయన్నారు. ఈ నగరాన్ని ఇలాగే నిర్లక్ష్యానికి బలిచేద్దామా అని ప్రశ్నించారు. చిన్న వర్షానికే ఉస్మానియా ఆస్ప్రత్రి (osmania hospital) మునిగిపోయిందన్నారు. చెరువులు ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదన్నారు. హైదరాబాద్​లో 960 చెరువులు ఉండాల్సి ఉండగా.. 461 కబ్జాకు గురయ్యాయని చెప్పారు. మెట్రో పాలిటన్​ సిటీల్లో (metro politan cities) నివసించలేని పరిస్థితి నెలకొందన్నారు.

    కాలుష్యంతో ఢిల్లీ (delhi polution) తల్లడిల్లుతోందని పేర్కొన్నారు. నీటి నిల్వలను ఒడిసి పట్టుకోకపోవడం వల్లే బెంగళూరు విలవిల్లాడుతోందన్నారు. బెంగళూరు ప్రజలు (bengaluru people) వలసపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. చిన్న వర్షం పడితే ముంబయిలో (mumbai city) పనిచేసే పరిస్థితి ఉండదన్నారు. ఇది ప్రకృతి విపత్తు కాదని.. మానవ తప్పిదమన్నారు. గుణపాఠం నేర్చుకోకపోతే హైదరాబాద్​ (hyderabad) సైతం ఆ సిటీల సరసన చేరుతుందన్నారు. ప్రకృతిని కాపాడుకుంటే (save nature) కొందరికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి మాత్రమే కాదని సీఎం స్పష్టం చేశారు.

    Latest articles

    Krishnashtami | పాఠశాలల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..

    అక్షరటుడే, ఆర్మూర్/భీమ్​గల్​: Krishnashtami | కృష్ణాష్టమి వేడుకలను ఆయా పాఠశాలల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను...

    IND vs PAK Match | భార‌త్ మాతో మ్యాచ్ ఆడ‌క‌పోతే బాగుండు.. దేవుడికి ప్రార్ధ‌న‌లు చేస్తున్న పాక్ క్రికెట‌ర్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs PAK Match | సెప్టెంబర్ 14న జరగనున్న భారత్ vs పాకిస్తాన్(Ind...

    Nalgonda | బాలికపై హత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nalgonda | నల్గొండలోని (Nalgonda) దారుణ హత్యాచార కేసులో జిల్లా కోర్టు సంచ‌ల‌న తీర్పు...

    Stock Market | రోజంతా ఒడిదుడుకులు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | సెన్సెక్స్‌, నిఫ్టీలలో వరుస ఆరు వారాల నష్టాలకు బ్రేక్‌ పడిరది....

    More like this