HomeతెలంగాణHydraa | ఫిర్జాదిగూడలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు..

Hydraa | ఫిర్జాదిగూడలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | మేడ్చల్​ medchal జిల్లా మేడిపల్లి medipalli మండలం ఫిర్జాదిగూడ మున్సిపల్​ కార్పొరేషన్ (Firzadiguda Municipal Corporation​) పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఫిర్జాదిగూడలోని పలు నిర్మాణాలను గురువారం ఉదయం హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు బయటకు తీసుకునే సమయం కూడా ఇవ్వడంలేదని వాపోయారు. కాగా హైడ్రా సిబ్బంది బుధవారం ఫిర్జాదిగూడ మున్సిపల్​ కార్పొరేషన్ పరిధిలో కూల్చివేతలు చేపట్టారు. మేడిపల్లి ఆర్ఏఆర్ కాలనీలోని సెజ్ స్కూల్‌ (sage school) యాజమాన్యం హైదరాబాద్-వరంగల్ హైవే లింక్ రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేసింది.