ePaper
More
    HomeతెలంగాణHydraa | రాజేంద్రనగర్​లో హైడ్రా కూల్చివేతలు.. జేసీబీలకు అడ్డంగా పడుకున్న మహిళలు

    Hydraa | రాజేంద్రనగర్​లో హైడ్రా కూల్చివేతలు.. జేసీబీలకు అడ్డంగా పడుకున్న మహిళలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Hydraa | హైదరాబాద్​ నగరంలోని రాజేంద్రనగర్​(Rajendranagar)లో హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. నగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కాపడటానికి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ భూముల రక్షణకు హైడ్రా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఆక్రమణలపై స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ప్రతి సోమవారం హైడ్రా కమిషనర్​ రంగనాథ్​(Hydra Commissioner Ranganath) ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి.. ఆక్రమణలు నిజమని తేలితే కూల్చివేస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్​లో హైడ్రా(Hydraa) కూల్చివేతలు చేపట్టింది.

    Hydraa | పార్క్ స్థలం కబ్జా

    రాజేంద్రనగర్​లోని హైదర్​గూడలో పార్కు స్థలం(Park Place) కబ్జా చేసి ప్రహరీ నిర్మించారనని నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్(Nalanda Nagar Welfare Association) హైడ్రాకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు పార్కును ఆక్రమించి గోడ నిర్మించినట్లు గుర్తించారు. ఆ నిర్మాణాలను తొలగించడానికి మంగళవారం ఉదయం జేసీబీలతో నలందానగర్​ చేరుకున్నారు.

    Hydraa | అడ్డుకున్న స్థానికులు

    పార్క్​ స్థలంలో నిర్మాణాలు చేపట్టిన వారు హైడ్రా అధికారులను(Hydraa Officers) అడ్డుకున్నారు. తాము తమ పట్టా భూముల్లో నిర్మాణాలు చేపట్టామని వారు పేర్కొన్నారు. కూల్చివేతలు చేపట్టొద్దని కోరారు. అంతేగాకుండా పలువురు మహిళలు జేసీబీలకు అడ్డుగా పడుకొని నిరసన తెలిపారు. అయితే భారీగా పోలీసుల సాయంతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి తీసుకెళ్లి పార్క్​ స్థలంలో నిర్మించిన కట్టడాలను కూల్చి వేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. హైదర్​ గూడ సర్వే నంబరు 16లో వెయ్యి గజాల పార్కు స్థలం కబ్జా చేసి ప్రహరీ నిర్మించారని తెలిపారు. కబ్జాలు ఎక్కడ ఉన్నా.. వాటి వెనుక ఎంతటి నాయకులు ఉన్నా తొలగిస్తామని హెచ్చరించారు.

    Read all the Latest News on Aksharatoday.in

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...