అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై హైడ్రా అధికారులు hydraa officials వేగంగా స్పందిస్తున్నారు. రోడ్లు, పార్కులు ఆక్రమించి చేపట్టిన కట్టడాలపై ఇటీవల ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో హైడ్రా అధికారులు ఆయా ఆక్రమణలను కూల్చి వేస్తున్నారు. తాజాగా మేడ్చల్ medchal జిల్లా మేడిపల్లి medipalli మండలం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ Firzadiguda Municipal Corporation పరిధిలో బుధవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు.
మేడిపల్లి ఆర్ఏఆర్ కాలనీలోని సెజ్ స్కూల్ sage school యాజమాన్యం హైదరాబాద్-వరంగల్ హైవే లింక్ రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించారు. ఇటీవల హైదర్నగర్లో సైతం హైడ్రా అధికారులు లే అవుట్లోని రోడ్లు, పార్కులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించిన విషయం తెలిసిందే.