అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైడ్రా అధికారులు నగరంలోని పలు చెరువులను పునరుద్ధరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అంబర్పేట (Amberpet)లోని బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకు వచ్చారు.కూకట్పల్లి (Kukatpally)లోని నల్ల చెరువును సైతం పునరుద్దరిస్తున్నారు.
ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. డిసెంబర్లో ఈ చెరువును ప్రారంభించడానికి హైడ్రా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కూకట్పల్లి పరిధిలోని నల్ల చెరువు సమీపంలో ఉన్న ప్రకాష్ నగర్ (Prakash Nagar) కాలనీలో హైడ్రా గురువారం కూల్చివేతలు చేపట్టింది. కాలనీలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చడానికి హైడ్రా బుల్డోజర్లు రాగా.. స్థానికులు అడ్డుకున్నారు. హైడ్రా సిబ్బందితో వాగ్వాదం చేశారు. తమకు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడుతారని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసుల సాయంతో హైడ్రా అధికారులు (Hydraa Officers) కూల్చివేతలు చేపట్టారు.
Hydraa | హైడ్రాకు మద్దతుగా ర్యాలీ
హైడ్రా (Hydraa) పని తీరును ప్రశంసిస్తూ కూకట్పల్లి నల్ల చెరువు వద్ద వాకర్స్ గురువారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఒకప్పుడు ఎటువైపు రావాలంటేనే నరకం కనిపించేదన్నారు. దుర్గంధంతో ఊపిరి ఆడేది కాదని చెప్పారు. హైడ్రా ఈ చెరువును అభివృద్ధి చేసిన తర్వాత ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది అంటూ అభినందించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మించడం హర్షం వ్యక్తం చేశారు. ఓపెన్ జిమ్లతోపాటు షటిల్ కోర్టులను కూడా ఏర్పాటు చేయాలని కోరారు.