HomeతెలంగాణHydraa | కొండాపూర్​లో హైడ్రా కూల్చివేతలు.. రూ.3,600 కోట్ల భూమి స్వాధీనం

Hydraa | కొండాపూర్​లో హైడ్రా కూల్చివేతలు.. రూ.3,600 కోట్ల భూమి స్వాధీనం

Hydraa | హైదరాబాద్​(Hyderabad)లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నగరంలోని కొండాపూర్​ సర్వే నెంబర్ 59లో హైడ్రా అధికారులు, సిబ్బంది శనివారం ఉదయం ఆక్రమణలను తొలగించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Hydraa | హైదరాబాద్​(Hyderabad)లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నగరంలోని కొండాపూర్​ సర్వే నెంబర్ 59లో హైడ్రా అధికారులు, సిబ్బంది శనివారం ఉదయం ఆక్రమణలను తొలగించారు.

కొండాపూర్​(Kondapur)లోని ఆర్టీఏ కార్యాలయం పక్కన భిక్షపతి నగర్‌లో భూమిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. 36 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా హైడ్రా(Hydraa) సిబ్బంది భారీ పోలీస్​ బందోబస్తు మధ్య నిర్మాణాలను కూల్చివేశారు. కూల్చివేతల దగ్గరికి పోలీసులు ఎవరిని అనుమతించలేదు.

Hydraa | హైకోర్టు తీర్పుతో..

సుమారు 36 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించారు. గతంలో దీనిపై రంగారెడ్డి కోర్టు భూమి ప్రైవేట్​ వ్యక్తులదేనని తీర్పు చెప్పింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని ఇటీవల హైకోర్టు(High Court) తీర్పు చెప్పింది. దీంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. షెడ్లను తొలగించి చుట్టు ఫెన్సింగ్​ ఏర్పాటు చేశారు. కాగా ఈ భూమి విలువ రూ.3,600 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే 60 ఏళ్లుగా ఆ భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని రైతులు చెబుతున్నారు.