Homeతాజావార్తలుHydraa | గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు.. ఎఫ్​సీఐ లే అవుట్​లో ఆక్రమణల తొలగింపు

Hydraa | గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు.. ఎఫ్​సీఐ లే అవుట్​లో ఆక్రమణల తొలగింపు

గచ్చిబౌలిలో హైడ్రా అధికారులు సోమవారం కూల్చివేతలు చేపట్టారు. ఎఫ్​సీఐ లే అవుట్​లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ నగరంలోని గచ్చిబౌలిలో హైడ్రా అధికారులు సోమవారం కూల్చివేతలు చేపట్టారు. ఎఫ్​సీఐ లే అవుట్​లో సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్​ అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించారు.

గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ సమీపంలో సహకార గృహనిర్మాణ సంఘం లోపల అక్రమంగా నిర్మించిన భవనాలు, షెడ్ల​ను అధికారులు గతంలో గుర్తించారు. హైకోర్టు (High Court) తీర్పు మేరకు సోమవారం ఉదయం హైడ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. పోలీస్​ బందోబస్తు మధ్య నాలుగు అనధికార షెడ్‌లను, నిర్మాణంలో ఉన్న భవనాన్ని అధికారులు తొలగించారు.

Hydraa | అసలు ఏం జరిగిందంటే..

గ‌చ్చిబౌలిలోని (Gachibowli) ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఎంప్లాయీస్ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లే అవుట్‌లో సంధ్యా క‌న్వెన్ష‌న్ య‌జ‌మాని శ్రీ‌ధ‌ర‌రావు ఆక్ర‌మ‌ణ‌లకు పాల్పడ్డారు. మొత్తం 20 ఎకరాల పరిధిలో ఎఫ్‌సీఐ లే అవుట్‌ ఉండగా.. 162 ప్లాట్లు ఉన్నాయి. అందులో చాలా వరకు సంధ్యా కన్వెన్షన్ (Sandhya Convention)​ యజమాని శ్రీధర్​రావు కొనుగోలు చేశారు. దీంతో లే అవుట్​లోని పార్కులు, రోడ్లను ఆయన కబ్జా చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో గతంలోనే హైడ్రా చర్యలు చేపట్టింది. అయితే హైడ్రాపై (Hydraa) శ్రీధర్​రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇటీవల శ్రీధర్​రావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలను తొలగించాలని హైడ్రాకు సూచించింది. దీంతో తాజాగా హైడ్రా అధికారులు (Hydraa Officers) నిర్మాణాలు కూల్చివేశారు.

Hydraa | 18న విచారణ

సంధ్య కన్వెన్షన్​ యజమాని శ్రీధర్​రావు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ ప్లాట్లు కొని.. త‌మ‌ను భ‌య‌పెట్టి మిగ‌తావి కూడా సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించార‌ని ఆరోపించారు. లే అవుట్‌లోని రోడ్లు, త‌మ ప్లాట్లు, పార్కులు స‌రిహ‌ద్దులు ప‌ట్టించుకోకుండా నిర్మాణాలు చేప‌ట్టార‌ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్లాట్ల య‌జ‌మానుల‌కు హైకోర్టు అండ‌గా ఉంటుంద‌ని న్యాయమూర్తి చెప్పారు. అనంతరం విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. ఈ క్రమంలో తాజాగా హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం గమనార్హం.

Must Read
Related News