అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hydraa commissioner | హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) గన్‌మన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. హయత్‌నగర్‌లోని (Hayathnagar) తన నివాసంలో తుపాకీతో కాల్చుకున్నాడు.
హైడ్రా కమిషనర్ గన్‌మన్‌గా కృష్ణ చైతన్య పని చేస్తున్నాడు. ఆయన కుటుంబంతో కలిసి హయత్ నగర్లో నివాసం ఉంటున్నాడు. అయితే ఆయన తన గన్‌తో కాల్చుకున్నాడు. కొంతకాలంగా చైతన్య ఆర్థిక ఇబ్బందులతో (financial problems) బాధ పడుతున్నట్లు సమాచారం. అప్పులు, ఆర్థిక సమస్యలతో ఆయన కొంతకాలంగా మనవోదనకు గురి అవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు యత్నించినట్లు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.