HomeతెలంగాణHydra | నిబంధనలు ఉల్లంఘించి ఆస్పత్రి నిర్మాణం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హైడ్రా కమిషనర్​

Hydra | నిబంధనలు ఉల్లంఘించి ఆస్పత్రి నిర్మాణం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హైడ్రా కమిషనర్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydra | నిబంధనలు ఉల్లంఘించి ఆస్పత్రి hospital నిర్మాణం చేపట్టడంపై హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ Hydra Commissioner Ranganath ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి అంటే మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సింది పోయి.. ఎక్క‌డిక‌క్క‌డ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ hyderabad​ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ RTC X roads లోని డాక్ట‌ర్‌ శంక‌ర్స్ ఆస్పత్రిని shankars hospital నిబంధనలు ఉల్లంఘించి నిర్మించారని స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్​ హాస్పిటల్​ను పరిశీలించారు. రోడ్లను ఆక్రమించారని, నాలుగు అంతస్తుల భ‌వ‌న నిర్మాణానికి అనుమ‌తులు తీసుకుని.. సెల్లార్‌తో పాటు.. 6 అంత‌స్తుల‌ను ఎలా నిర్మిస్తార‌ని ఆస్పత్రి యజమాని డాక్టర్​ శంక‌ర్‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ప్ర‌శ్నించారు. అనుమతులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Hydra | అధికారులపై మండిపాటు..

ఒక‌వైపు 10 అడుగుల దారి, మ‌రోవైపు 15 అడుగుల దారి ఉన్న‌చోట ఇన్ని అంత‌స్తులు ఎలా నిర్మిస్తార‌ని కమిషనర్​ ప్రశ్నించారు. నివాస ప్రాంతాల మ‌ధ్య ఇరుకు ర‌హ‌దారుల్లో పెద్ద భవనం huge building కట్టారని, భ‌విష్య‌త్తులో ఏమైనా ప్ర‌మాదం జ‌రిగితే ఎవ‌రు బాధ్య‌త వహిస్తార‌ని సంబంధిత అధికారుల‌ను అడిగారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ఆస్పత్రికి లైసెన్స్ ఎలా మంజూరు చేశారని అధికారులపై ఆయన మండిపడ్డారు. దీనిపై పూర్తి వివ‌రాల‌తో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.