అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad beach : తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్‌కు బీచ్ రాబోతోంది. ఏమిటీ.. అసలు సముద్రమే లేని మహా నగరానికి బీచ్ రావడమేంటీ.. అనుకుంటున్నారా..? అవునండీ.. మీరు చదివేది నిజమే..
కాకపోతే ఇది ఆర్టిఫిషియల్ బీచ్ (artificial beach). విశ్వ నగరంగా విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) కు ఏదైనా కొదవ ఉందంటే.. అది బీచ్ ఒక్కటే.
సముద్ర మట్టానికి సుమారు 700 అడుగుల ఎత్తులో డక్కన్ పీఠభూమిపై (Deccan Plateau) విస్తరించిన భాగ్యనగరానికి ఇక ఆ లోటు కూడా తీరబోతోంది. నగర శివారులో ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు కాబోతోంది.
Hyderabad beach | కొత్వాల్‌గూడలో..
నగర శివారులోని కొత్వాల్‌గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. సుమారు 35 ఎకరాల్లో రూ.225 కోట్ల వ్యయంతో బీచ్ నిర్మించనున్నట్లు తెలిసింది.
బీచ్ పనులు డిసెంబరులో మొదలుకానున్నట్లు సమాచారం. ఈ ఆర్టిఫిషియల్ బీచ్‌లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టుల వంటివి చేర్చనున్నట్లు తెలుస్తోంది.
Hyderabad beach | పర్యాటక రంగానికి పెద్దపీట
తెలంగాణలో కోటలు, వారసత్వ ప్రదేశాలు, పర్యావరణ పర్యాటక గమ్యస్థానాలు సహా రూ. 15,000 కోట్లకు పైగా విలువైన పర్యాటక సామర్థ్యం ఉంది. ఇక కృత్రిమ బీచ్ కూడా అందుబాటులోకి వస్తే.. ప్రపంచ పర్యాటక ప్రదేశాల లీగ్‌లోకి హైదరాబాద్ ప్రవేశించినట్లే.