అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Terror Conspiracy | హైదరాబాద్‌లో ఉగ్రకుట్రకు ప్రణాళిక వేసినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు చెందిన ఓ ఉగ్రవాది జైలు నుంచే పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి.
దేశవ్యాప్తంగా లష్కరే తోయిబా సంస్థ దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ (Delhi)లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో సైతం విధ్వంసానికి పథకం రచించినట్లు నిఘా వర్గాల అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. .. జైలు నుంచే ప్రణాళికలు సాగినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు (Intelligence Officers) భావిస్తున్నారు.
Hyderabad Terror Conspiracy | నిఘా పెంపు
నగరంలోని మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ ప్రాంతాలపై పోలీసుల నిఘా పెంచారు. చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail) నుంచే ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుస పేలుళ్లకు కుట్ర చేశారని ముగ్గురు నిందితులు అరెస్ట్ చేశారు. జైలులో ఉన్న సదరు ఉగ్రవాదిని కలవడానికి వచ్చిన వారిపై సైతం ప్రత్యేక నిఘా పెట్టారు. ములాఖత్‌కు వచ్చిన వారితో దాడుల గురించి మాట్లాడినట్లు సమాచారం. ఈ మేరకు నగరవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉగ్రదాడికి కుట్ర పన్నారనే వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.