HomeతెలంగాణCyberabad | సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. విదేశాల నుంచి యువతుల అక్రమ రవాణా

Cyberabad | సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. విదేశాల నుంచి యువతుల అక్రమ రవాణా

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Cyberabad : సైబరాబాద్ పరిధిలోని పలు స్టార్ హోటళ్లు(star hotels) హైటెక్ వ్యభిచారం కేంద్రాలుగా మారిన‌ట్టు తెలుస్తోంది. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి యువతులను అక్రమ రవాణా చేసి, వాట్సాప్, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తూ ఓ అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇటీవల మాదాపూర్‌లోని ఓ ప్రముఖ హోటల్‌పై దాడి చేసిన సైబరాబాద్ Cyberabad యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం, ఈ హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులతో పాటు ఓ విదేశీ యువతిని రక్షించి, వారికి షెల్టర్ హోమ్‌లో స్థానం కల్పించారు. అదే సమయంలో ఒక విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Cyberabad : కోల్‌కతాకు లింకులు..

ఈ రాకెట్ వెనుక ప్రధాన ఆర్గనైజర్‌గా ఉన్న వ్యక్తి పేరు సుమిత్. అతడు కోల్‌కతాలో ఉంటూ హైదరాబాద్ సహా పలు మెట్రో నగరాల్లో వ్యభిచార కార్యకలాపాలు నడిపిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఉద్యోగాల పేరుతో యువతులను నగరాలకు రప్పించి, వారిని మాయమాటలతో వ్యభిచారంలోకి లాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుమిత్ Sumit కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ముఠా కార్యకలాపాల్లో ప్రతి అంశం ఆధునిక సాంకేతికత ఆధారంగానే సాగుతోంది. యువతుల ఫొటోలు, వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా విటులను సంప్రదించి ‘డీల్’ కుదుర్చుతున్నారు. ఒక్కో యువతికి రోజుకు వేలల్లో రూపాయలు చెల్లిస్తూ మత్తులోకి దించడం, ఆపై వారిని శారీరక వ్యాపారంలో బలవంతంగా కొనసాగించడం ఈ ముఠా వ్యూహంగా కనిపిస్తోంది.

సుమిత్‌ను అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా విస్తరించిన అతిపెద్ద సెక్స్ రాకెట్‌ Sex Rocket ముఠా బయటపడే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేశం గర్వించే మెట్రో నగరాల్లో ఇలా హైటెక్‌ వ్యభిచారం సాగుతుండటమంటే మానవ విలువలపై తూటా పేలినట్లే.