అక్షరటుడే, హైదరాబాద్: hyderabad rave party | రంగారెడ్డి జిల్లా Rangareddy district, మహేశ్వరం Maheshwaram పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టు (Resort) లో రేవ్ పార్టీని మహేశ్వరం ఎస్‌వోటీ బృందం SOT team, స్థానిక పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో 72 మందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని గట్టుపల్లి శివారులో ఉన్న కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో Resort నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.
మంగళవారం సాయంత్రం తలపెట్టిన రేవ్ పార్టీకి సంబంధించిన సమాచారం తెలియడంతో మహేశ్వరం ఎస్‌వోటీ బృందం, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్న 72 మందిని అదుపులోకి తీసుకొన్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పార్టీని వేద అగ్రి సీడ్స్‌కి చెందిన తిరుపతిరెడ్డి, రాక్‌స్టార్ ఫెర్టిలైజర్స్ యజమాని సైదారెడ్డి కలిసి ఏర్పాటు చేశారు.
పార్టీ ప్రత్యేకంగా ఫెర్టిలైజర్ యజమానుల కోసం ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు. ఈ పార్టీల మహిళలతో నృత్యాలు కూడా చేయించినట్లు తెలుస్తోంది.
hyderabad rave party | రేవ్ పార్టీ భగ్నం..
పోలీసుల సమాచారం మేరకు.. ఈ పార్టీకి తెలంగాణ Telangana, ఆంధ్రప్రదేశ్ AndhraPradesh రాష్ట్రాల నుంచి 56 మంది డీలర్లు, 20 మంది మహిళా డ్యాన్సర్లు వచ్చారు.
పాల్గొన్న వారు నృత్యం చేస్తుండగా.. పోలీసులు మఫ్టీలో రిసార్టులోకి వెళ్లారు. అక్కడ ఉన్న విదేశీ మద్యంను కూడా స్వాధీనం చేసుకున్నారు.
పార్టీలో పాల్గొన్న అందరిని అదుపులోకి తీసుకొని, వారిపై కేసులు నమోదు చేశారు. రిసార్టు యజమాని రాకేష్ రెడ్డిపై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఈ దాడిలో 3 బ్లాక్‌డాగ్ విస్కీ బాటిళ్లు, 2 కాటన్ బీర్లు స్వాధీనం చేసుకున్నారు.
మహేశ్వరం Maheswaram పోలీసులు ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పార్టీకి సంబంధించి ఇతర వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ పార్టీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రేవ్ పార్టీలపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వీటిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.