HomeతెలంగాణHyderabad Press Club | హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో నూతన పాలక వర్గం బాధ్యతల స్వీకారం

Hyderabad Press Club | హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో నూతన పాలక వర్గం బాధ్యతల స్వీకారం

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Hyderabad Press Club | హైదరాబాద్ Hyderabad ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం విజయ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.

ఈ సందర్భంగా వక్తలు దేవులపల్లి అమర్‌లాంటి మహానుభావులు ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం చేసిన సేవలను ప్రస్తావించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయాలని వారు కోరారు. ప్రెస్​ క్లబ్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాలని సూచించారు.

Hyderabad Press Club | సమస్యల పరిష్కారానికి కృషి..

ఈ సందర్భంగా నూతన పాలక వర్గం సభ్యులు మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను నెరవేర్చుతామని పునరుద్ఘాటించారు.

క్లబ్ Press Club నూతన అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేర్చుతామన్నారు.

హెల్త్ కార్డులు, ప్రెస్ క్లబ్ భవనం టైటిల్ డీడ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కూడా ఈ విషయాలపై స్పష్టత ఇచ్చారు.