HomeతెలంగాణHyderabad Press Club elections | హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. విజయం సాధించింది వీరే..

Hyderabad Press Club elections | హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. విజయం సాధించింది వీరే..

Hyderabad Press Club elections | హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలలో ఫ్రెండ్స్ ఫ్యానల్ వర్సెస్ యూనిటెడ్ ఫ్యానల్ పేరులతో పోటీ పడ్డారు.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Hyderabad Press Club elections | గత కొద్ది రోజులుగా హోరెత్తిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ Press Club ఎన్నికల సందడి ముగిసింది. ఈ ఎన్నికల్లో ఫ్రెండ్స్ Friends ప్యానల్ – యునైటెడ్ United ప్యానల్ పోటీ పడ్డాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా నువ్వా – నేనా అనే రీతిలో ఈ ఎన్నికలు జరిగాయి. పోలింగ్​ ప్రశాంతంగా జరగడానికి ప్రతి జర్నలిస్టు journalist సహాయం అందించారు.

ఈ ఎన్నికలలో elections  మహిళా జర్నలిస్టులు తమ ఐక్యతను చాటుకున్నారు. ఏ ఫ్యానల్ నుంచి పోటీ చేసినా సరే.. మహిళా జర్నలిస్టుకు మాత్రం తప్పకుండా ఓటు వేయాలని నిర్ణయించి, అందుకు అనుగుణంగా అడుగులు వేశారు.

ఫ్యానల్​తో పాటు వ్యక్తిగతం, వ్యక్తిత్వం ఈ ఎన్నికల్లో అభ్యర్థుల విజయంపై ప్రభావం చూపినట్లు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Hyderabad Press Club elections | విజేతలు వీరే..

అధ్యక్షులు : ఎస్ విజయ్ కుమార్ రెడ్డి
ఉపాధ్యక్షులు : ఏ రాజేష్, అరుణ అత్తలూరి
ప్రధాన కార్యదర్శి : రమేష్ వరికుప్పల
సహాయ కార్యదర్శి : చిలుకురి హరి ప్రసాద్, వీ బాపురావు
కోశాధికారి : రమేష్ వైట్ల
కార్యవర్గ సభ్యులు : రచన ముడుంబి, ఎన్ ఉమాదేవి, కళ్యాణ రాజేశ్వరి, మర్యాద రమాదేవి, శంకర్ సిగ, కస్తూరి శ్రీనివాస్, నాగరాజు వనం, ఎన్ శ్రీనివాస రెడ్డి, అశోక్