HomeతెలంగాణHyderabad ORR | మ‌రో రెండు రోజుల్లో అమ‌ల్లోకి వార్షిక ఫాస్ట్ ట్యాగ్.. హైదరాబాద్ ఔటర్...

Hyderabad ORR | మ‌రో రెండు రోజుల్లో అమ‌ల్లోకి వార్షిక ఫాస్ట్ ట్యాగ్.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌కు కూడా చెల్లుతుందా..?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad ORR | దేశవ్యాప్తంగా ప్రయాణించే ప్రైవేట్ వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15, 2025 నుంచి ‘నేషనల్ ఫాస్టాగ్ వార్షిక పాస్’ (FASTag Annual Pass) అమల్లోకి రానుంది. ఈ పాస్ ద్వారా ప్రయాణికులు ఏడాది రోజుల్లో 200 టోల్ ట్రిప్స్‌ను కవర్​ చేసే వీలుతో, రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పాస్ మాత్రం జాతీయ రహదారులపై మాత్రమే వర్తించనుంది. ఈ పాస్ ప్రత్యేకంగా ప్రైవేట్ కార్లు, జీపులు, వాన్‌లు వంటి నాలుగు చక్రాల వాహనాలకే వర్తిస్తుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలపై మాత్రమే దీని ప్రయోజనాలు లభిస్తాయి.

Hyderabad ORR | హైదరాబాద్ ORRపై వర్తించదా?

వార్షిక ఫాస్టాగ్ పాస్ వల్ల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్​పై (Hyderabad ORR) ప్రయోజనం ఉంటుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. ORR స్టేట్ ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి చెందిన క్ర‌మంలో అది నేషనల్ హైవే కింద రాదు. మ‌రోవైపు ORRపై ఉన్న టోల్ గేట్లు IRB ప్రైవేట్ ఎంటిటీ ద్వారా ఆపరేట్ చేస్తుంది. ఇది కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేస్తున్న క్ర‌మంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాస్‌లు, డిస్కౌంట్లపై యాజమాన్య విధానాల ప్రకారమే టోల్ వసూలు చేయ‌డం జర‌గుతుంది. అందుకే, నేషనల్ ఫాస్టాగ్ వార్షిక పాస్ ఉప‌యోగించి ORRపై ప్ర‌యాణించలేం. మీరు ORRపై ప్రయాణించాలంటే త‌ప్ప‌నిస‌రిగా టోల్ చెల్లించాల్సిందే. HMDA నుంచి అందించే ORR-స్పెసిఫిక్ నెలవారీ పాస్‌లు తీసుకున్నా మీకు చాలా ఉప‌యోగంగా ఉంటుంది.

రెగ్యులర్ ప్రయాణికుల కోసం అనుకూలంగా ఉంటాయి. ప్రతి కిలోమీటర్‌కు సుమారు రూ.2.44 ఛార్జ్ వసూలు అవుతుంది. మీరు ప్రతిరోజూ ప్రయాణిస్తే, నెలవారీ పాస్ ద్వారా వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. హైదరాబాద్ ORR టోల్ పాస్ ఎలా తీసుకోవాలి?అంటే అధికారిక వెబ్‌సైట్: https://orrhyderabad.in లోకి వెళ్లి మీ వాహనానికి నెలవారీ పాస్ అప్లై చేయవచ్చు. టోల్ చార్జీలు తెలుసుకోవచ్చు.ఫాస్టాగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. ప్రయాణ చరిత్ర, లెక్కలు, రసీదు పొందవచ్చు. గమనించాల్సిన ముఖ్యాంశాలు ఏంటంటే.. ORRపై FASTag తప్పనిసరి, కానీ NHAI వార్షిక పాస్ అమలుకాదు. నేషనల్ ఫాస్టాగ్ వార్షిక పాస్ అనేది NHAI ఆధ్వర్యంలోని జాతీయ రహదారులపై ఉన్న‌ టోల్ ప్లాజాలలో మాత్రమే వాడొచ్చు. మ‌రోవైపు ఈ పాస్‌ను వాడాలంటే మీరు ప్రయాణించే హైవే NHAI పరిధిలో త‌ప్ప‌క‌ ఉండాలి.