HomeతెలంగాణHyderabad Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్‌.. భారీగా పెరిగిన టిక్కెట్ ధరలు!

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్‌.. భారీగా పెరిగిన టిక్కెట్ ధరలు!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ L&T Metro Rail Limited షాకిచ్చింది. మెట్రో ఛార్జీలను పెంచేసింది. కనిష్ట టిక్కెట్‌ ధర రూ.12, గరిష్టంగా రూ.75గా నిర్ణయించింది. ఇంతకు ముందు ఈ ధరలు కనిష్టం రూ.10, గరిష్టం రూ.60గా ఉండేది.

పెంచిన ఛార్జీలు శనివారం(మే 17) నుంచి అమల్లోకి రానున్నాయి. నిత్యం మెట్రోలో ప్రయాణిస్తూ ఆఫీస్‌లకు వెళ్తున్న ప్రయాణికులకు ఈ పెంపు భారంగా మారనుంది.

ప్రయాణ ఛార్జీల పెంపుపై ఎల్‌ అండ్‌ టీ సంస్థ స్పందిస్తూ వివరణ ఇచ్చింది.. “మా విలువైన ప్రయాణికుల నిరంతర మద్దతు కోరుతున్నాం. హైదరాబాద్ మెట్రో రైలు సేవల నాణ్యతను అందరికీ మరింతగా అందించడానికి సవరించిన ఛార్జీల అంశాన్ని స్వీకరించడంలో మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం” అని కోరింది.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ Hyderabad Metro Rail project ను లార్సెన్ అండ్‌ టూబ్రో Larsen & Toubro అనుబంధ సంస్థ అయిన ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ L&T Metro Rail (Hyderabad) Limited నిర్మించింది.

Must Read
Related News