అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ (Hyderabad) మెట్రోలో నిత్యం వేలాది మంద్రి ప్రయాణం చేస్తుంటారు. చాలా మంది ఉద్యోగులు ట్రాఫిక్ బాధలు తప్పించుకోవడానికి మెట్రో (Metro)ను ఆశ్రయిస్తారు. దీంతో మెట్రో రైళ్లకు ఆదరణ పెరగడంతో రద్దీ కూడా పెరిగింది. అయితే హైదరాబాద్లోని చైతన్యపురి మెట్రో స్టేషన్కు విద్యుత్ సంస్థ నోటీసులు జారీ చేసింది.
చైతన్యపురి మెట్రో స్టేషన్ (Chaitanyapuri Metro Station)కు విద్యుత్ సంస్థ బుధవారం నోటీసులు ఇచ్చింది. రూ. 31,829 కోట్ల బకాయిలు చెల్లించాలని, లేకపోతే జప్తు చేస్తామని అందులో పేర్కొనడం గమనార్హం. మెట్రో పనుల కోసం విద్యుత్తు కనెక్షన్‌ను మెస్సర్స్ థేల్స్ ఇండియా ప్రైవేటు ఏజెన్సీ 2015 జులై 23న తీసుకుంది. అనంతరం ఆ సంస్థ పనుల నుంచి తప్పుకుంది. దీంతో 2021 డిసెంబరు నాటికి బకాయి పడిన బిల్లులు వసూలు చేయడానికి ఎస్పీడీసీఎల్ (SPDCL) చర్యలు చేపట్టింది. ఈ మేరకు మెట్రో స్టేషన్కు జప్తు నోటీస్ అంటించింది.
మెట్రో కోసం పని చేసిన ఈ ఏజెన్సీ మెస్సర్స్ థేల్స్ చిరునామా, నంబరును గుర్తించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా జప్తు నోటీసును చైతన్యపురి మెట్రో రైలు స్టేషన్‌లో అంటించారు. ఆ సంస్థ వివరాలు దొరకిన తర్వాత బకాయిలు వసూలు చేసే అవకాశం ఉంది.