అక్షరటుడే, కామారెడ్డి: Hyderabad Mayor | రామారెడ్డి-ఇసన్నపల్లి (Rama Reddy-Isannapalli) కాలభైరవ స్వామి ఆలయంలో (Kalabhairava Swamy Temple) హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Mayor Gadwal Vijayalakshmi) మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆమె స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మేయర్‌కు అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి తొలిసారిగా విచ్చేసిన మేయర్‌కు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Hyderabad Mayor | కాశీ క్షేత్రం తర్వాత ఇసన్నపల్లిలోనే..
కాశీ క్షేత్రం తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాలభైరవ స్వామి ఆలయం ఇదేనని గ్రామస్థులు చెబుతారు. కార్తీక బహులాష్టమి రోజు శ్రీ కాలభైరవ స్వామి జయంతిని ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. ఈ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారని వారు వివరించారు.