అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Bike Showroom Fire | హైదరాబాద్ (Hyderabad) నగరంలో అగ్ని ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. తాజాగా కూకట్‌పల్లిలోని ఓ బైక్ షోరూంలో మంటలు అంటుకున్నాయి.
నగరంలోని అత్తాపూర్‌లో రెండు రోజుల క్రితం కార్ల షోరూమ్ (Car Showroom)లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు కాలిపోయాయి. తాజాగా కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ (KPHB Police Station) పరిధి సాయినగర్ హీరో షోరూంలో ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు.
Hyderabad Bike Showroom Fire | రద్దీగా ఉండే ప్రాంతం
సాయినగర్ ప్రాంతంలో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ అనేక వాణిజ్య దుకాణాలు ఉన్నాయి. గురువారం ఉదయం షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. చిన్నగా ప్రారంభమైన మంటలు నిమిషాల్లోనే వ్యాపించాయి. దీంతో సిబ్బంది, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. ప్రమాదంలో పలు బైక్‌లు కాలిపోయాయి. షోరూమ్‌లోని ఫర్నిచర్, ఎలక్ట్రికల్ పరికరాలు, కంప్యూటర్లు, డాక్యుమెంట్లు దగ్ధమైనట్లు సిబ్బంది తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అత్తాపూర్‌లోని పిల్లర్ నంబర్.185 సమీపంలోని సుజుకి షోరూమ్ సర్వీస్ సెంటర్ (Suzuki Showroom Service Center)లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్గోడౌన్లో మంటలు చెలరేగడంతో మూడు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు.